Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

Rahasyam book review

Casual talks about books – “The Secret” Book in Telugu – Rahasyam.

Article Written by Prakash. K — published on Twinkle Talks (www.twinkletalks.com)

Introduction

అందరికీ నమస్కారం ట్వింకల్ టాక్స్ కు స్వాగతం

ఈ రోజు మనం ఒక పుస్తకం గురించి తెలుసుకుందాం.

                         రహస్యం

బుక్ పేరే రహస్యమా?

అవును

rahasyam book review

మరి చదవచ్చా?

First పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చదవచ్చు

ఆ పేరెందుకు పెట్టారంటావు?

మనుషులు ఏదైతే చెయ్యొద్దు అంటారో అదే పని చేస్తారు కాబట్టి రహస్యం అని పేరు పెడితె కచ్చితంగా చదువుతారని పెట్టిండవచ్చు ఆని నా పర్సనల్ ఒపీనియన్.

సరే సరే నీ వ్యక్తిగత అభిప్రాయం ఎవరికీ కావాలిగాని ఈ బుక్ లో ఏముందో చెప్పు.

“రహస్యం” పుస్తకం వివరాలు (book details):

పుస్తకం పేరురహస్యం
రచయిత్రిరొండా బర్న్
తెలుగు అనువాదంశాంత సుందరి
published byManjul publishing house
(www.manjulindia.com)

ఈ బుక్ ని ఆస్ట్రేలియా రచయిత్రి రొండా భర్న్ (Rhonda byrne ) వ్రాసారు తెలుగులోకి శ్రీమతి శాంత సుందరి గారు అనువాదం చేసారు.

ఇందులో మొత్తం 11 topics వున్నాయి అందులోనుంచి ఒకటి చెబుతా అదే ఆకర్షణ సిద్ధాంతం.

ఆకర్షణ సిద్ధాంతం ( Law of attraction )

     ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది పూర్తిగా మన ఆలోచన విధానానికి సంభందించిన విషయం.

     రెండు భుజాల పైన వుండే మెదడుకి (brain) అయస్కాంత శక్తి (magnetic force) ఉంటుంది.

     అందులో  +ve frequency & -ve frequency అని రెండు రకాలు ఉంటాయి.

     నువ్వు ఎప్పుడైతే ఒక విషయం గురించి +ve గా ఆలోచిస్తావో నీకు జరిగిన నీ చుట్టూ వున్న +ve విషయాలను ఆలోచనలను నీ బ్రెయిన్ ఆకర్షిస్తుంది.

     ఇదే లాజిక్ నువ్వు -ve గా ఆలోచిస్తే నీకు జరిగిన మరియు నీచుట్టూ వున్న -ve విషయాలను ఆకర్షిస్తుంది.

     అల్లాదీన్ అద్భుత దీపం లోని జీని దాని యజమాని కోరుకున్న వాటిని నెరేవేరుస్తుంది అవి మంచివా?  చెడ్డవా?  అన్న సంగతి దానికి అనవసరం చెప్పిన పని చేస్తుంది అంతే.

      అలాగే నీ బ్రెయిన్ కూడా నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ జీవితంలో అవి జరిగేలా చూస్తుంది, నువ్వు ఆలోచించేది మంచా?  చెడా?  అన్న విషయం నీ బ్రెయిన్ కి అనవసరం.

    కాబట్టి మనం చెడుకు బదులు మంచినే అలోచించి ఆకర్షిద్దాం.

     కొంతమంది ఉంటారు ఎప్పుడు నెగటివ్ గా ఆలోచిస్తున్న ఉంటారు వారికీ ఒక పరిష్కారం దొరికితే ఆ పరిష్కారంకి కూడా ఒక సమస్యను వెతుకుతారు.

     ఇలాంటి వారు ఆకర్షణ సిద్ధాంతం ద్వారా బాధపడి ఇతరులకి కూడా ఇబ్బందులు తెస్తారు.

     మీ జీవితం తాలూకు బ్లాక్ బోర్డుని  (black board )  మీరే నింపాలి. అందులో మంచినే నింపండి.

     నీకు ఇంకో example చెబుతా విను మనం రాత్రిపూట పడుకునే ముందు ఏదైనా ఒక sad సాంగ్ వింటే చాలు మనకు జరిగిన బ్రేకప్ (breakup ) నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అన్ని గుర్తుకువచ్చి మన్నశాంతి లేకుండా పోతుంది.

    అదే ఏదైనా మంచి మాస్ సాంగ్ గాని హుషారైన పాట గాని  వింటే నువ్వు లైఫ్ లో  చేసిన ఎంజాయ్ అంతా గుర్తొస్తుంది.

     అదే ఆకర్షణ సిద్ధాంతం (Law of attraction )

నువ్వు ఏది కోరుకుంటావో అదే నీకు వస్తుంది.

rahasyam book review
Law of attraction diagram

     ఆ డయాగ్రమ్ (diagram ) లో గ్రీన్ కలర్ లైన్స్ మీ బ్రెయిన్ నుంచి వచ్చే +ve మంచి ఆలోచనలు కాబట్టి ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీకు మీ చుట్టూ వుండే మంచి విషయాలు మీకు జరిగిన మంచి పనులు వాటి తాలూకు జ్ఞాపకాలు మీరు పొందుకుంటారు.

     అందులో కనిపించే బ్లూ కలర్ (blue colour ) మీ అలోచించే -ve విషయాలు కాబట్టి మీకు మీ చుట్టూ ఉన్న ఇబ్బందికరమైన విషయాలు చెడు జ్ఞాపకాలు మీ బ్రెయిన్ ఆకర్షిస్తుంది.

     ఇలాంటి సిద్ధాంతమే మన భారతదేశంలో

        ఏత్ భావం తత్ భవతి అన్నారు.

మీరు ఏమి కావాలనుకుంటే అదే అవుతారు.

     ఈ ఒక్క రహస్యం మాత్రమే చెప్పారా ఈ బుక్ లో?

     లేదు ఇంకా చాలా వున్నాయి

     ధనం తాలూకు రహస్యం

     ఆరోగ్యం తాలూకు రహస్యం

     బాంధవ్యాల తాలూకు రహస్యం

     జీవితం తాలూకు రహస్యం 

     ఈ లోకం తాలూకు రహస్యాలు వున్నాయి

     ప్రతి రహస్యం మనకు ఎంతగానో use అవుతుంది.

      ఇతరులు నిన్ను ఇష్టపడాలంటే ముందు నిన్ను నీవు ఇష్టపడు.

      నీ దగ్గర లేని డబ్బు గురించి భాదపడక ఉన్న డబ్బు పట్ల కృతజ్ఞత కలిగి వుండి కష్టపడు.

మీ జీవితంలోని ఒక్కొక్క అంశం లోని రహస్యం ను మీరు తెలుసుకుంటారు

మీలో దాగి వుండి బయటపడని శక్తిని మీరు తెలుసుకుంటారు.

ఈ పుస్తకాని ఆదారంగా చేసుకొని ఒక సినిమా కూడా తీశారు .

ఈ పుస్తకాని ఆదారంగా చేసుకొని ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు .

ఈ బుక్ నాకు ఇచ్చిన నా ఫ్రెండ్ హేమంత్ సాయి (hemanth sai ) కి చాలా థాంక్స్.


Thank you for reading రహస్యం Rahasyam book review | The Secret | Rhonda Byrne

మరిన్ని చదవండి:

  1. అమృతం కురిసిన రాత్రి

2. ఆస్తులు అమ్ముకొని ఆత్మశోదనకై ఒక యోగి ప్రస్థానం.

for more click this link >>>> www.twinkletalks.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!