Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

Introduction

Blog రచన :Prakash. K – published on Twinkle Talks

Amrutham kurisina Ratri book

రాత్రి ఆ రాత్రి ఎప్పటికి మరువలేని రాత్రి

రాత్రి ఆ రాత్రి అమృతం కురిసిన రాత్రి

అవును నిజమే తెలుగు సాహిత్యపు వెన్నెల్లో నేను తడిసిన రాత్రి

ఆ బాల గంగాధరుడి రచనల్లోని 

అమృతాన్ని ఆస్వాదించిన రాత్రి

ఆ రచనలను ఒడిసి పట్టిన పుస్తకం గురించి చెపుతాను

Amrutham kurisina Ratri book
Amrutham kurisina Ratri book

ఈసారి చదవడానికి ఏ పుస్తకం తీసుకోవాలి అని లైబ్రరీలో వెతుకుతున్నప్పుడు ఈ పుస్తకం నా కంటపడింది అంతకముందు ఆ పుస్తకం తాలూకు వివరాలు కానీ విలువ కానీ నాకు ఏమాత్రం తెలియదు.

చదివాకా తెలిసింది అదృష్టం కొద్ది నాకు కనిపించిందని.

పుస్తకం వివరాలు:

అమృతం కురిసిన రాత్రి – Amrutham Kurisina Ratri Book

పుస్తకం పేరుఅమృతం కురిసిన రాత్రి (కవితా సంపుటి )
రచయితదేవరకొండ బాల గంగాధర్ తిలక్
ప్రచురణ కర్తలువిశాలాంధ్ర పబ్లిషిoగ్ హౌస్
Amrutham kurisina Ratri book

ఇందులో మొత్తం 93 కవితలు వున్నాయి

అందులో 14 కవితలు  అసంపూర్ణం మరియు అముద్రిత రచనలు పెద్దల సహాయంతో  చేర్చారు.

ఒక సైనికుడి అంతరంగం గురించి కానీ

చీకటి తెరల తాలూకు వర్ణన గురించి కానీ

ఒక జాతి యొక్క భావాలు వాటి మూలాల అంతరంగం గురించి కానీ రచయిత  వర్ణించిన విధానానికి ఆశ్ఛర్యం కలిగింది

నా తెలుగు భాషలోని అందాన్ని

నా తెలుగు సాహిత్యానికి వున్న విలువలని

తెలిసొచ్చేలా చేసిన ఈ పుస్తకంలోని రచనలు అమోగం.

దారంతా గోతులు ఇల్లేమో దూరం

ఈ పుస్తకం లోనుంచి ఉదాహరణకు  ఒక కవిత్వం  గురించి చెప్పాలనుకున్నాను.

దారంతా గోతులు

ఇల్లేమో దూరం

చేతిలో దీపం లేదు

ధైర్యమే ఒక కవచం

మీరు

చేరుకోవలసిన (సాధించవలసిన)

గమ్యం దూరంగా వున్నప్పుడు

పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా

మీ గుండెలనిండా ధైర్యం ఉంటే చాలు

మీరు చేరుకోవలసిన గమ్యంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు వున్న  కచ్చితంగా చేరుతారు.

మీరు ఎక్కడైనా రాజకీయ ప్రసంగాలలో కానీ పెద్దల సభలో కానీ ఈ వాక్యాలు వినివుంటారు

ఈ వాక్యాలు ఎందరినో ఉత్తేజ పరిచాయి

గుండె ధైర్యం కలవారి మాటలుగా నిలిచాయి

నీడలు 

ఈ వాక్యాలు ” నీడలు ” అనే కవితలోని  చివరి పేరాలోని చివరి వాక్యాలు

చిన్నమ్మా వీళ్ళమీద కోపగించుకోకు వీళ్ళ నసహ్యించుకోకు
నిన్నెన్నెన్నో అన్నారు అవమానాలా పాల్చేశారు అవినీతి అంటగట్టారు ఆడదానికి సాహసం పనికిరాదాన్నారు
చిన్నమ్మా వీళ్లందరూ భయపడిపోయిన మనుష్యులు, రేపటిని గురించి భయం, సంఘ భయం అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయంగతంలో కూరుకుపోయినా మనుష్యులు, గతించిన కాలపు నీడలు
చినమ్మా వెళ్లందరూ తోకలు తెగిన ఎలకలు కలుగుళ్లోంచి భయటకు రాలేరు లోపల్లోపలే తిరుగుతారు
మోడ్యం వల్ల భలాడ్యులు అవివేకం వల్ల అవినాషులు వీళ్లందరూ మధ్యతరగతి ప్రజలు సంఘపు కట్టుబాట్లకి రక్షకభటులు శ్రీమంతుల స్వేచ్చా వర్తనకి నైతిక భాష్యకారులు శిథిలాలమాలకు పూజారులు
చినమ్మా వీళ్ళను విడిచి వెళ్ళిపోకు – వీళ్లందరూ నీ బిడ్డలు ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు – వాచకాలలో నీతుల్ని వల్లీస్తూ దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ ఓపికలేని భార్యలకు సహనాన్ని భోదిస్తూ ధైర్యంలేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్లమధ్య డైనమైట్ పెలాలి డైనమోలు తీరగాలి 

కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి

రిపక్క నిల్చిన మోడుచెట్లు బాధని అనువధించాలి

పచ్చికలో దాకున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి

రేపటి ఉదయాన్ని ఈ వేళ వెలుగుల్నిసమాకూర్చుకోవాలి 

కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి దారిపక్క నిల్చిన మోడుచెట్లు బాధని అనువధించాలి పచ్చికలో దాకున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి – రేపటి ఉదయాన్ని ఈ వేళ వెలుగుల్నిసమాకూర్చుకోవాలి 

చీకటి పడుతుంది

చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది

శిధిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది

దారంతా గోతులు ఇల్లేమో దూరం

చేతిలో దీపంలేదు, ధైర్యమే ఒక కవచం

మళ్ళీ ఒక దీపావళి

శతకోటి హస్తములు ఒక్కటిగా నొక్కిన చప్పట్టులు నేడు,ఇంక భయం లేదు జాతి తన సత్వాని గుర్తుంచుకుంది వందలాది వస్తరాల మగతలోంచి, మాయలోంచి, జడిమ జబ్బులోంచి కోలుకుంది, బలం పుంజుకుంది.
చరిత్ర ఎండిన గొంతులో పవిత్ర శాంతిసుధని చిందాలనిఇదీ ఒక మంచికే వచ్చింది స్వతంత్రాన్ని చవిచూసినవాడు స్వర్గంలో నివసించినవాడు బానిసత్వానికి తల ఒగ్గలేడు నరకానికి ససేమీరా పోడు. 

మళ్ళీ ఒక దీపావళి – మళ్ళీ ఒక దీపావళి కొత్త కొత్త దీపావళి – శాంతిసౌఖ్య తారావాలిభారత జనయిత్రి పదపూజ నవగీతావళి మళ్ళీ ఒక దీపావళిమనకే కాదు మహీవలయ సమస్తానికి మహదాశాయ జీవన విధాన మహాస్సిమకి మళ్ళీ ఒక దీపావళి.


ఇలాంటివి ఎన్నో మరెన్నో.

ఒక సందర్భం తాలూకు విశేషాలు కానీ

ఒక సంఘటన తాలూకు భావాలు కానీ

ఒక వాక్యం లో చెప్పగలిగిన ఎన్నో ఈ పుస్తకంలో ఉన్నవి.

నిజంగా తెలుగు సాహిత్యంలోని అమృతాన్ని అందించిన పుస్తకం.

అలాగే వర్షహేళి”, నిరీక్షణ” మళ్ళీ ఒక దీపావళి లాంటి శ్రీ పాద క్రిష్ణమూర్తి గారి చేర్చిన కవితలు అలాగే

శ్రీ తంగిరాల వెంకటసుబ్బారావు గారు ఇచ్చిన కవి వాక్కు త్రిమూర్తులు వంటి కవితలు కూడా ఎంతో బాగున్నాయి.

ఆ బాల గంగాధరుడి రచనలు చదివిన ఎందరో అదృష్టవంతుల్లో నేను ఒకడిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 

మరిన్ని >>

  1. Rahasyam

2. Gnapaka Shakthi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!