Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

The Greatness Guide Book in Telugu

Hello everyone , Twinkle Talks కు స్వాగతం. This Article was written by Prakash. K ; publishing on twinkletalks.com. ఇప్పుడు మనం రాబిన్ శర్మగారు రచించిన “మహోన్నతికి మార్గదర్శకాలు” అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. (The Greatness Guide Book in Telugu).

పుస్తకం వివరాలు :

పుస్తకం పేరుమహోన్నతికి మార్గదర్శకాలు 
రచయితరాబిన్ శర్మా 
తెలుగు అనువాదంమన్నవ గంగాధర ప్రసాద్ 
topics101
The Greatness Guide Book in Telugu
The Greatness Guide Book in Telugu
The Greatness Guide Book in Telugu

ఈ పుస్తకం లో మొత్తం 101 topics వున్నాయి.

ప్రతి ఒక్క విషయం మనకు చాలా నేర్పుతుంది. 

వాటిలోని కొన్నిటిని గురించి తెలుసుకుందాం.

  ———————-@@@@@————————

The Greatness Guide Book in Telugu

1.ఈ రోజే నీ చివరి రోజు

     మనలో చాలా మందికి మనం చేయవలసిన పనులను, సాదించాలనుకున్న వాటిని నిర్లక్ష్యం వల్లనో భయం వల్లనో చెయ్యలేకపోతుంటాం.

     మనం ఉదయాన్నే లేచినప్పుడు ఈ రోజే నా జీవితానికి చివరి రోజు అని భావించండి, ఎలాగో ఈ ఒక్క రోజే వుంది కాబట్టి చెయ్యాలనుకున్న పనులు మీరు చెయ్యగలరని రాబిన్ గారు అంటారు.

     ఊదాహరణకి మీరు మీ startup plan ని స్టార్ట్ చేయాలన్న, ఎప్పటినుంచో చూడాలనుకున్న place ని చూడాలన్న, చదవాలనుకున్న పుస్తకాన్ని చదవాలన్న, మీరు ప్రేమించిన వ్యక్తి కి మీ కాదల్ తెలపాలన్న మీకు మిగిలింది ఒక్క రోజే కాబట్టి

ఖచ్చితంగా చేస్తారు.

     మొదట్లో అలా అనుకోవటానికే చాలా ఇబ్బందిగా ఉన్న మానసికంగా అలవాటు చేసుకుంటే మీరు చెయ్యాలనుకున్న పనిని ముఖ్యంగా వాయిదా వేసుకునే మనస్తత్వాని జయించగలరు.

                                                  2.మీ వయసుని ఆపండి

     ఇది వినగాన్నే మీ వయసు పెరుగకుండా వుండేందుకు మంత్రం వుందనుకోకండి, దీని అర్ధం ఏమిటంటే మీరు ఎల్లపుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ వుండండి.

     శరీరానికి వయసు ఉంటుంది కానీ జ్ఞాననికీ కాదు కాబట్టి మన ఎల్లప్పుడు నిత్య విధ్యార్ది లాగా ఉండాలి.

ఉదాహరణకు సంగీతం, నాట్యం, guitar, flute, oil painting, ఆప్టిట్యూడ్ మొదలగునవి.,

మనం ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తామో అప్పుడే మన వయస్సు పెరగటం మొదలవుతుంది.

3. మీరు ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నారా? అయితే ఎవరికీ చెప్పొద్దు

  మాటలు కోటలు దాటుతాయి చేతలు ఇంటి గడప దాటవు అని అంటుంటారు సామెతగా. ఎవరైనా ఒక పని గురించి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి చివరకు ఏమి చెయ్యకుండా లేదా చెప్పినంత చేయకుండా ఉండే వాళ్ళ కోసం ఈ సామెతను ఉపయోగిస్తారు.
ప్రియా! నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అని చెప్పి కష్టం వచ్చాక వదిలేసే ఎందరో ప్రేమికులు ఉన్నారు. మీరు చెప్పే మాటలకి చేతలకి వెత్యాసం లేకుంటే మీ మీద ఒక నెగటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది.మీరు చెయ్యాలనుకున్నది చెప్పడం తప్పు కాదు కానీ చెప్పే విషయం పట్ల ఎంత నిజాయితీగా ఉన్నారన్నదే ప్రశ్న!
మీరు ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నారా? అయితే ఎవరికీ చెప్పొద్దు, ఎందుకంటే తరువాత ఆ పనిలో విజయం సాధించకుంటే వీడు మాటల్లో ఘటికుడు చేతల్లో పనికిరాని వాడు అని అంటారు, ఇలా అనే వాళల్లో మనకి సహాయం చేసేవారు ఉండొచ్చు ఉండక పోవచ్చు, వారి వెక్కిరింతలు మనలో ధైర్యాన్ని దెబ్బ తీసే అవకాశలు చాలానే ఉంటాయి.

ఉదాహరణ ఒక చిన్న కథ :
ప్రవల్లిక అనే b. Tech చదివే ఒక అమ్మాయి ఇంట్లో వాళ్ళతో ఈ సెమిస్టర్ లో నేనే క్లాస్ ఫస్ట్ వస్తాను అని ఇంట్లో ఉన్న తన తల్లిదండ్రులతో, స్నేహితులతో  చెప్పేది, తన కూతురు ఇంతలా చెబుతుండటం చూసి వాళ్ళు కూడా సంతోషించారు, మిడ్ ఎగ్జామ్స్ లోనే ఏదో తేడా కొట్టింది, కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవొచ్చులే అనుకుంది, అయినా సరే వన్ డే బ్యాట్టింగ్ కు సిద్దపడింది మహాతల్లి (మనలో చాలా మంది చేసేది అదే అనుకోండి అది వేరే విషయం) ఎలాగోలాగా ప్రవల్లిక పాస్ అయితే అయ్యింది కానీ సెమిస్టర్ మొదటి నుంచి తను ప్రచారం చేసుకున్నట్టు జరగక పోయేసరికి పరువు పోయినట్టు అయ్యింది, దీనివన్నీ బడాయి మాటలు వే, ఆ పిల్లకంత సీన్ లేదు వే అని, ఆ-వే ఈ-వే అనుకుంటున్న మాటలు ప్రవల్లిక చెవిలో పడ్డాయి, అయ్యో దేవుడా అనవసరంగా ఫస్ట్ వస్తాను అని పదే పదే చెప్పానే అని అనుకుంది ఈ సారి ఏదైనా మాటల్లో కాదు చేతల్లో చూపించాలి అనుకుంది.
అది ఫ్రెండ్స్ స్టోరీ మీరు కూడా ప్రవల్లిక లాగా మాటల్లో కాకుండా చేతల్లో చూపించండి. 

నువ్వు ఎంత మాటలు చెప్పిన, చెప్పినంత చెయ్యలేక పోయినా, నీ పట్ల నిజాయితీగా  నమ్మకంగా ఉండేది నీ అంతరాత్మ ఒక్కటే.
విజయం నీ మాటలు చెవిలోకి ఎక్కించుకోదు, నీ చేతలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది.

—————-@@@@——————-

నా అభిప్రాయం :

ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో (The Greatness Guide Book in Telugu) ఉన్నాయి, ప్రతి విషయం కూడా మనo ఉన్నతంగా జీవించడానికి ఉపయోగపడతాయి.

మీరు కూడా ఈ పుస్తకాన్ని చదివి మీ లైఫ్ లో ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను

***************** Thank you ************************

Read this article in English here>>>>>>> The Greatness Guide 1

మరిన్ని చదవం:

  1. మ్యాజిక్

2. కనిపించని కంచెలు

For more >>>>> twinkle talks      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!