Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

కనిపించని కంచెలు | Invisible Borders |

హలో everyone, I am Nani nestham , TwinkleTalks కు స్వాగతం . ఇప్పుడు మనం ఒక ఇంపార్టంట్ విషయం గురించి మాట్లాడుకుంధామ్ . (kanipinchani kanchelu)

మనలో చాలా మంధి కొత్త పనులు / ప్రయోగాలు చెయ్యాలి అనుకున్నపుడు ఎంధుకు వెనుకడుతాం ?

మనము ఎంత గొప్పగా వుండగలమో , అంతలా వుండలేక పోవడానికి కారణం ?

అటువంటి కారణాల గురించి robin Sharma గారు “ మహోన్నతికి మార్గదర్శకాలు -2” పుస్తకంలో  ‘కనిపించని కంచెలు’ గా వర్ణిస్తారు .

Robin గారు ఒక సారి పల్లెటూరికి వెళ్లినప్పుడు అక్కడ ఒక  కుక్కల శిక్షణ కేంద్రం (dog training centre) లో కనిపించని కంచె (invisible border ) , గురించి వ్రాసి వుంది . అంటే ఆ   కుక్క దాటలేని ఒక  కనిపించని సరిహద్ధు.

అది ఎలా అంటే ఒక particular area చుట్టూ కంచె నిర్మించి ఆ కంచె లోపల ఒక కుక్క కి శిక్షణ (training) ఇస్తారు , కొన్ని రోజులకి ఆ కంచె తీసివేసిన కూడా ఆ కుక్క ఆ border area దాటి వెల్లదు.

ఇదే విధంగా మనం  కూడా మన నిజ  జీవితంలో మనకు కనిపించని ఎన్నో కంచెల మధ్యలో   చిక్కుకొని  వున్నాము . అంధులో కొన్ని మనలో మనకు ,ఇతరుల వల్ల మనకు ఏర్పడే కంచెలు.  వాటి గురించి మాట్లాడుకుందాం.  ముందుగా…

మనలో మనకు ఏర్పడే కంచెలు :

  • ఏవైనా కొత్త పనులు చేయటానికి  –  ‘భయం’ అనే కంచె .
Invisible Borders
Inner feeling
  • Stage మీదకి వెళ్ళి మాట్లాడాలన్న , పాట  పాడాలన్న పది మంది ‘నవ్వుతారేమో’ అనే కంచె.
Shyness + Fear

వినటానికి funny గా వున్న , ఇవి కేవలం ఒక వ్యక్తి success కి మాత్రమే అడ్డుగా వుంటాయి, కానీ క్రింద చెప్పుకునే విషయాలు సమాజానికే నష్టం.

ఇతరుల వల్ల లేదా వారి పట్ల ఏర్పడే కంచెలు

  • పేద వారితో కలిసిమెలిసి వుండటానికి డబ్బు తెసుకువచ్చే  – ‘status’ అనే కంచె .
  • { కానీ అస్సలు పేదరికం డబ్బు తక్కువ సంపాధనలో లేదు , ప్రతి మనిషిని సమానం గా చూడలేకపోయే భుద్ధి లో వుందని కొంత మంది గ్రహించరు}

ఒక చిన్న కథ :

మన కాకినాడలో చలపతీ, దళపతీ అని ఇద్దరు వ్యక్తుల కుటుంబాలు ఒకే వీధిలో ఉండేవాళ్ళు, పైగా ఇద్దరు ఒకే ఆఫీసులో ఒకే డిపార్ట్మెంట్ లో ఎంప్లాయిస్ కూడా, చలపతీ డబ్బు పరంగా మొదటి నుంచి బాగా ఉన్నవారే, తాత, తండ్రి సంపాదించిన ఆస్తి బాగానే ఉంది, దళపతీకి అలా తాతలు కానీ తండ్రిగాని సంపాదించి పెట్టిన ఆస్తులు ఏమి లేవు కానీ సొంతంగా కష్టపడి పైకి వచ్చినవాడు, ఎంత కష్టపడి వచ్చిన ఎంత సంపాదించిన చలపతీకి ఉన్నంత పలుకుబడి కానీ డబ్బు కానీ లేవు.

ఇచ్చే మర్యాదలో కానీ, చూసే విధానంలో కానీ తేడా చూపించే వాడు చలపతీ, కానీ దళపతీ ఎవ్వరికైనా అవతలివాడు తక్కువ, ఎక్కువ అనే బేధాలు, కంచెలు, దళపతికి ఉండేవికావు, అందరితోనూ మంచిగా ఉండేవాడు. చలపతీ కూతురు పెళ్ళికి కూడా దళపతి కుటుంబాన్ని పిలవలేదు మనోడు, పైగా పెళ్ళి ఖర్చంతా తనదే తన ఇంటి దైవం గుడిలోనే పెళ్ళి జరిపేలా సిద్ధం చేసాడు.  ఎంత అహంకారం అని అనిపిస్తుంది కదా ఒకే ఆఫీసు, ఒకే డిపార్ట్మెంట్ పైగా ఒకే వీధి ఉంటారు ఇలాంటి జాతి రత్నాలు కొంతమది ప్రతి చోటా.

పెళ్ళికొడుకు తరుపున వాళ్లు వస్తున్న దారిలో డ్రైవర్ ఓవర్ టేక్ చెయ్యబోయి బోల్తాపడింది కారు, అప్పటికి అక్కడ పని చేస్తున్న కూలీలు స్పందించారు కాబట్టి సరిపోయింది లేదంటే ఘోర ప్రమాదం జరిగేది, విషయం తెలుసుకున్నాక చలపతీకి నోటా మాట పడిపోయింది, అక్కడపెళ్ళికొడుక్కి రక్తం అవసరం, ఎవ్వరిని అడిగిన ఇవ్వము అని కొందరు, అయ్యో పోయినా వారమే డొనేట్ చేసాము అని కొందరు అంటున్నారు, అప్పుడు చలపతి మొక్కని దేవుడంటూ లేడు, ఇంతలో ఫోన్ ఎవరో వచ్చి బ్లడ్ ఇచ్చారు కంగారు పడవలసింది ఏమి లేదు అని, దేవుడా కాపాడవు నాయనా అనుకోని హాస్పిటల్ కి వెళ్లి చూస్తే, తన వీధిలో వుండే మణికంఠ గారి అబ్బాయి, వాట్సప్ బ్లడ్ డొనేషన్ గ్రూపులో వచ్చిన మెసేజ్ చూసి వచ్చాడు, ఇంతకీ ఎవరీ మణికంఠ అంటే దళపతీ లాగే తనుకూడా పెళ్ళికి పిలవబడని వారిలో ఒకడు ఒకే వీధిలో ఉన్నకానీ – చెప్పానుగా మన చలపతీకి ఉండే హోదా, స్థాతి అని కనిపించని కంచెలు ఉన్నాయని ఆ కంచెల మూలాన ఆహ్వానం పొందని కుటుంబానికి చెందిన వాడు.

ప్రాణం విషయం దగ్గరకు వచ్చేసరికి చలపతికి ఎటువంటి కంచలు మద్యలో తాను బ్రతుకుతున్నాడని అర్ధం అయ్యింది, కృతజ్ఞతలు చెబుదాం అంటే తల ఎత్తి చెప్పలేని స్థితి.

ఇలాంటి కనిపించని కంచెల మధ్య మనలో చాలామంది బ్రతుకుతున్నారు, వాటికి పౌరుషం, రోషం అని పేర్లు పెట్టుకుని కాలం గడిపేస్తున్నారు.

(Kanipinchani Kanchelu)

  •    మన తోటి వారితో కలిసి మెలిసి వుండటానికి పనికి మాలిన  – ‘caste feeling’  అనే కంచెని మనము ఇంకా కొన్ని చోట్ల మన మనసుకు కనిపిస్తుంది.
  • కొంత మంది తాను ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను చెప్పటానికి తన రంగు / రూపం { physical appearance }  మీద పనికి రాని చెత్త భయాలు, కంచెలుగా వుంటాయి.

{  ప్రేమ రంగు, రూపం లోనె వుండదు }

  • రెండు నిండు మనసులు ఒక్కటి అవ్వాలంటే మళ్ళీ చెపుతున్న ‘రెండు నిండు మనుసులు ఒక్కటి అవ్వాలంటే మాత్రం – ‘మతం’ – ‘status’‘డబ్బు’‘caste‘ అనే  ముళ్ల కంచెలు పుట్టుకొస్తాయి.

Science and technology ఇంతలా develope అయిన కూడా ఇలాంటి కనిపించని కంచెలు { invisible boundaries } వెనుకటి తరం నుంచి మనవరకు తొలగి పోవటం లేధు .

అహంకారాన్నికి , మూర్ఖత్వానికి, పద్ధతి అనే పేరుతో పాటిస్తునారు కొంత మ౦ది, వీటి వల్ల మనకు చాలా నష్టమే వుంటుంది.

మన ఎదుగుదలకి , మన విజయనికి అడ్డుగా వున్న ఇలాంటివి ఎన్నో కంచెలని (Kanipinchani Kanchelu) నిర్మూలించి ఉన్నతంగా జీవిద్దాం.

Thank You  – ఆర్టికల్ వ్రాసింది నాని నేస్తం.

Read the above article in English here >>>> Invisible Borders

మరిన్ని చదవండి:

  1. మా తుజే సలాం :

2. సునామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!