Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

The monk who sold his ferrari book in Telugu

ఈ రోజు మనం Mr.Robin Sharma గారు రచించిన ఒక book గురించి తెలుసుకుందాం. The monk who sold his ferrari book in telugu. astulu-ammukoni-athma-shodanakai-oka-yogi-prasthanam

అందరికీ నమస్కారం, Twinkle Talks కు స్వాగతం.

Written by Prakash. K ; Published on Twinkle Talks.com

వివరాలు : (The monk who sold his ferrei book in telugu)

పుస్తకం పేరు ఆస్తులు అమ్ముకొని ఆత్మశోదనకై ఒక యోగి ప్రస్తానం
రచయిత రాబిన్ శర్మ గారు 
ప్రచురణ కర్త జైకో పబ్లికేషన్ హౌస్ (www.jaicobooks.com)
ఆధ్యాయాలు13
తెలుగు అనువాదం డా.సి.మృణాళిని

ముఖ్య పాత్రలు:

జాన్ ఒక లాయర్
జూలియస్ మాంటేల్అమెరికాలోని ఒక ఫేమస్ లాయర్, చాలా ధనవంతుడు కూడా. 
యోగి జీవితానికి ఉపయోగపడే కొన్ని techniques ని, సూత్రాలని జాన్ కి వివరించిన వ్యక్తి 
యోగి కృష్ణన్ కాశ్మీర్ లోని ఒక ఆలయ వ్యవహారదారుడు, ఓకప్పటి లాయర్.
రామన్ యోగి శివనపీటం గురువు
శివనపీటంహిమాలయాలోన్ని ఒక సుందర ప్రదేశం 

విషయం  :

ఈ పుస్తకం లోని మొత్తం కథ ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ.

  • పుస్తకంలో జరిగే కథని జాన్ వివరిస్తుంటాడు.
  • జూలియస్ మాంటేల్ ఒక రోజు court hall లో గుండెపోటు తో కుప్పకూలిపోతాడు, అక్కడ వున్న వ్యక్తులు అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. తరువాత అతని జాడ ఎవరికి తేలిక పోతుంది.
  • కొన్ని రోజుల తరువాత జాన్ ను కలవటానికి ఒక యోగి వస్తాడు, ఆ యోగి తన గురువు అయిన రామన్ యోగి నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాల గురించి జాన్ కు వివరిస్తాడు, ఆ విషయాలు ప్రతి యొక్క వ్యక్తి జీవితాన్ని మెరుగుపరిచే విదంగా వుంటాయి.
  • ఆ యోగి ఎవరో మీరు చదువుతున్నపుడు మీకు తెలిసిపోతుంది.
  • ఆ యోగి తన జీవితాన్ని శివనపీటం యోగులను కలువకముందు, కలిసిన తరువాతగా విభజించుకున్నాడు.
  • ఆత్మ శోధనలో భాగంగా తెలుసుకున్న విషయాలు , రహస్యాలు మానవ జీవితానికి సానుకూల దృక్పధం లోకి నడిపిస్తాయి.
  • అందులో ముఖ్యంగా కొన్ని techniques

                             గులాభి దర్శనం

                                   సరస్సు రహస్యం

                                   కైజాన్ అభ్యసనం

                                   ప్రస్తుతాన్ని ఆస్వాదించడం

                                   క్రమశిక్షణ, సంకల్పభలం యొక్క ప్రాముఖ్యత

                                   ఆకాంక్షలు ఫలించడానికి 5 మెట్లు

 లాంటి  ఇంకా ఎన్నో విషయాలు ఆ యోగి, జాన్ కు వివరిస్తాడు.


{ నీ ఆలోచనా నాణ్యతా, నీ జీవన విదానం నాణ్యతను
నిర్ధారిస్తుందని,
ధర్మాచారణ వల్లే మానసిక ప్రశాంతి , అని ఈ పుస్తకం తెలుపుతుంది. }
  • సంభాషణలో జాన్ కు ఒక సుమో యోధుడి కథ చెపుతాడు యోగి. ఆ కథలోని 7 వస్తువులు వుంటాయి, ప్రతి వస్తువుకి ఒక సుగుణం(సూత్రం) వుంటుoది. ఆ మంచి గుణాలను(సూత్రాలను) మన నిజ జీవితంలో ఆచరిస్తే మంచి ప్రయోజనాలు వుంటాయి.
  • 7 సూత్రాల ప్రతీకలు
    • సుందర ఉధ్యానవనం

                        లైట్ హౌస్

                        సుమో యోధుడు

                       పింక్ wire cable

                        బంగారు stopwatch

                        పరిమలించే గులాబీలు

                        వజ్రాలభాట                

ప్రతి  ప్రతీక యొక్క సుగుణాలు మనిషి జీవితాన్ని మునుపెన్నడూ లేని ఉత్సాహంగా, యవ్వనంగా  మారుస్తాయి. 

ఒక చిన్న విషయం మీరు మీ జీవితాన్ని ఒక అందమైన తోటలాగా బావించండి, మీ ఆలోచనలు ఆ తోటలోనినికి వచ్చే సందర్శకులు అనుకోండి.

ఆ తోటకి కాపలాగా మీరే వున్నారనుకోండి, ఆ తోటని పాడుచేసే సందర్శకులని (negative thoughts) మీరు అనుమతిస్తారా? ఖచ్చితంగా లేదుకదా. కాబట్టి మీరు మంచిగా ప్రవర్తించే వారిని (positive thoughts) ని మాత్రమే అనుమతించండి.

అప్పుడే మీ అందమైన తోట (జీవితం) బాగుంటుంది. పైన చెప్పిన 7

సూత్రాలలో ఇది (సుందర ఉధ్యానవనం) ఒకటి మాత్రమే, మిగిలిన

ప్రతి సూత్రం మనకు ఎన్నో నేర్పిస్తాయి.

  • ప్రస్తుతములో కాక ఊహల్లో బ్రతికే వారికోసం యోగి గారు, పీటర్ అనే పిల్లవాడి కథ చెపుతారు, కథ చివరన మనకు ప్రస్తుతాన్ని ఆస్వాదించడం (enjoy the present ) యొక్క విలువ తెలుస్తుంది.

ఎంత పెద్ద ఆస్తిపరుడైన, సిరి సంపదలలో మునిగి తెలుతున్న శరీరానికి సంబంధించిన వ్యాధి లేదా రోగం వచ్చినప్పుడు డబ్బుతో నయం చేయించుకోగలడు, పరవాలేదుకాని మానసికంగా జబ్బు పడితే? డబ్బుకి, హోదాకి వాటిని నయం చేసే శక్తి లేదు. ఓరి దేవుడా! అవును కదా, ఆర్థికంగా ఐశ్వర్యవంతునిగా ఉండటంతో పాటు మానసికంగా కూడా ఐశ్వర్యావంతునిగా ఉండటం ముఖ్యం.


మన జీవితంలో మనకు ఎదురైనా కొన్ని విషయాలు మనకు ఏదో ఒకటి నేర్పుతాయి, కొన్ని కొన్ని పాఠాలు భవిష్యత్తుల్లో జరగబోయే ప్రమాదలను వాటి నుంచి రాబోయే ఇబ్బందులను కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాయి,  అది తెలుసుకొని మనకి ఉన్నదాన్ని పట్ల  కృతజ్ఞత కలిగి మనం జాగ్రత్త పడితే మనకే మేలు. 


కొన్ని కొన్ని  విషయాలు లేదా అనుభవాలు మనవరకు వచ్చి వెళ్ళాక తెలుసుకోవడం మంచిది, మరికొన్ని పెద్దలు చెప్పే మాటలు విని తెలుసుకోవడం మంచిది, ఇక్కడ పెద్దలు అంటే కేవలం వయసులో పెద్దవాళ్ళని మాత్రమే అర్ధం కాదు వయస్సులో చిన్నవడైనా అనుభవం ఎక్కువున్నా వాళ్ళు కూడా పెద్దవాళ్లే అని కూడా అర్ధం. పైన చెప్పిన తోట – తోటమాలి కథను ఉదాహరణంగా తీసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 

నా అభిప్రాయం (My Opinion):

  • Personal గా ఈ పుస్తకాని నేను రెండు విభాగాలుగా divide చేశాను

   from Chapter 1 to Chapter 5   & from Chapter 6 to Chapter 13.

  • చాలా చక్కటి విషయాలు వున్నాయి ఈ  పుస్తకంలో , compulsory గా చదవమని చెపుతాను.
  • ఇంత మంచి పుస్తకాని రచించిన robin sharma గారికి తెలుగులోకి translate చేసిన డా.సి. మృణాళిని గారికి thanks.

Read this article in English here, >>> The Monk Who Sold his Ferrari

Also Read :

  1. మహోన్నతికి మార్గదర్శకాలు – 2

3. For more >>>> Twinkle Talks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!