Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Demerits of Online Courses in Telugu
Share to others

ప్రతి  నాణెంకు రెండు వైపులు ఉన్నట్టు చాల విషయాలకు మంచి, చెడు  రెండు ఉంటాయి. ఈ ఆర్టికల్ లో ఆన్లైన్ కోర్సెస్ వళ్ళ జరిగే / కలిగే నష్టాలూ మరియు ఇబ్బందులు (Demerits of Online Courses in Telugu) గురించి Twinkle Talks ద్వారా  మాట్లాడుకుందాం.

  • ఇంటర్నెట్ అందుబాటులో వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికి బేసిక్ ఎడిటింగ్, వెబ్సైటు క్రియేషన్ ఎలా చెయ్యాలో తెలిసింది. 
  • కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వచ్చాకా ప్రతి టెక్నాలజీ లోని టెక్నిక్స్ జస్ట్ ప్రామ్ప్టింగ్ (promting) ద్వారా క్షణాల్లో రాబట్ట గలుగుతున్నారు. 
  • ఒక టెక్నాలజీ మీద అనుభవం లేని వాళ్ళు కూడా AI ఉపయోగించి కోర్సెస్ తయారు చేసి అమ్ముతున్నారు. మరి ముఖ్యంగా మిడిల్ క్లాస్ విద్యార్థులు, మరియు ఆసక్తి గలవారు త్వరపడి డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ (subscription) తీసుకుంటున్నారు. 
  • సరైన అనుభవం లేకుండా బోధించడం, డబ్బులు చెల్లించగానే రెస్పాండ్ అవ్వకపోవటం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త. 

Genuine websites for Online courses

  • ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తడం సహజం, కానీ ఏదైనా online course నేర్చుకుంటున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తే?
  • మనం Benefits of Online Courses in Telugu” ఆర్టికల్ లో చర్చించుకున్న విధంగా ఆన్లైన్ కోర్సెస్ మనకు అనుకూలమైన సమయంలో నేర్చుకోవచ్చు అని.  అయినప్పటికీ నేర్చుకుంటున్న వారి వైపునుంచో లేదంటే సర్వీస్ ప్రొవైడర్ నుంచి గాని issues వస్తే టైం వేస్ట్ అవుతుంది. 
  • కొన్ని సార్లు అనేకమంది వెబ్సైటు విసిట్ చెయ్యడం వళ్ళ సర్వర్ స్లోగా మారి నేర్చుకుంటున్న వారి ఆసక్తి పై ప్రభావం చూపుతుంది. 
  • చాలా శ్రద్దగా మీ కోచింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా మీకు మొబైల్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఎంత మంది జస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసి తిరిగి కోచింగ్ లో నిమగ్నమవుతారు?
  • ఒక్క ఇంస్టాగ్రామ్ రీల్ నోటిఫికేషన్ చాలు ఇప్పటి మన ఏకాగ్రతను చెరిపి వెయ్యటానికి. 
  • ఆ డిస్ట్రాక్షన్ (distraction) కొన్ని నిమిషాల పాటు, గంటల పాటు కూడా వుండే అవకాశం ఉంది. ఎలాగో మనకు అనుకూలమైన సమయం కాబట్టి మనకు అడ్డు  చెప్పే వారు ఉండరు. 
  • online courses learning కావలసిన ముఖ్యమైన విషయాలు 
  • సమయ పాలన – Time  management 
  • ఏకాగ్రత – concentration 
  • self discipline

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!