Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Benefits of Online Courses in Telugu
Share to others

అందరికి నమస్కారం Twinkle Talks కు స్వాగతం.

  • నింగి, నేల, నిప్పు, నీరు, గాలి వంటి పంచభూతాల వరుసలో  “ఇంటర్నెట్” కూడా చేరిందని చెప్పవచ్చు. 
  • YouTube, Facebook, Twitter వంటి సోషల్ మీడియా platforms ఓపెన్ చేసినప్పుడు మనకు తరచుగా వచ్చే Ads లో online courses కి సంబంధించినవి ఎక్కువగా రావడం మనం చూస్తుంటం. 
  • ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు ఆన్లైన్ కోర్సెస్ ద్వారా కలిగే పది ఉపయోగాలు లేదా లాభాలు (10 Benefits of Online Courses in Telugu) గురించి మాట్లాడుతాను. 
  • Online  కోర్సెస్ నేర్చుకోవాలి అని అనుకునే వారిలో అందరు ఇంటిదగ్గర వుండే వ్యక్తులు మాత్రమే ఉండరు కదా! అందులో కొందరు స్టూడెంట్స్, వర్క్ ఫ్రొం ఆఫీస్, గృహిణీలు, ఇంకా చాల రకాలుగా ఉంటారు. 
  • ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకునే వారికి ఉండే మొదటి లాభం  “సమయం అనుకూలత” “Time flexibility” 
  • ప్రస్తుతం ఇంట్లో ఉండే వాళ్ళకీ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లి నేర్చుకోవాలంటే సమయం కుదురుతుంది. కానీ పని చేసుకునే వారి పరిస్థితి?
  • స్కిల్స్ నేర్చుకునే వారికి ఆన్లైన్ కోచింగ్ ద్వారా వారికి అనుకూలంగా వుండే సమయం లో నేర్చుకుంటారు. 
  • ప్రాముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, లేదా చంటి బిడ్డల తల్లులు స్కిల్ డెవలప్మెంట్ కోసం కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళటం ఇబ్బంది. 
  • ఈ యొక్క online coaching ద్వారా మహిళలకి, అందులో పిల్లల తల్లులు  అనుకూలంగా ఉన్నపుడు నేర్చుకోవచ్చు.
  • ఉన్నది ఒక్కటే జిందగీ! ప్రతిక్షణం చాలా విలువైనది, ఇలాంటి భావాలు కలిగి ఉండటం ముఖ్యం. 
  • బ్రతికి ఉన్నప్పుడే ఈ భూమండలాన్ని చుట్టేయాలని చాల మంది ప్రయాణాలు చేస్తూ వుంటారు. 
  • ప్రయాణంతో పాటు కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు, ఎలాగో ప్రతి చోట ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి విహారం తో పాటు విషయం కూడా నేర్చుకుంటారు.  
  • ఎప్పటికప్పుడు మారుతున్న technology, టెక్నాలజీ అనుగుణంగా మారుతున్నా ఉద్యోగాలు, వీటిని ఒడిసి పెట్టుకోవాలంటే టెక్నాలజీ తగ్గట్టుగా మనం మారుతుండాలి. 
  • Updated టెక్నాలజీ కి సంబంధించిన స్కిల్స్  నేర్చుకుంటూ మీ యొక్క డొమైన్ లో active గా ఉండొచ్చు. 
  • నేర్చుకున్న దానిలో performance బాగుండి management చల్లని చూపు ఉంటె promotions కూడా ఆశించవచ్చు.  
  • ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం ఒక వయస్సు ఉన్నంతవరకే అనే చాల మంది భ్రమ పడుతుంటారు, కానీ ఏదైనా నేర్చుకోవాలన్న తపన, ఆసక్తి ఉండటం ఒక్కటే ముఖ్యం, వయసు కాదు. 
  • నేను ఇప్పటికే ఇద్దరు పిల్లల తండ్రిని, లేదా అమ్మమ్మ ని అని కోచింగ్ సెంటర్స్ కి వెళ్లి ఏదైనా నేర్చుకోవటానికి నామోషీ గా భావిస్తారు. 
  • అలాంటి వారికి ఆన్లైన్ కోర్సెస్ ద్వారా తమకు నచ్చిన కోర్స్ ను నచ్చిన మరియు అనుకూలమైన సమయం లో నేర్చుకోవచ్చు.
  • ప్రతికూల పరిస్థితుల వల్లనో, వ్యక్తిగత కారణాల వల్లనో కొందరి జీవితంలో  కొన్ని కొన్ని కారణాల వల్ల కెరీర్ గ్యాప్ career gap వస్తుంది. 
  • కెరీర్ గ్యాప్ ఉందని బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళటం కష్టం. ఆ కష్టాన్ని అధిగమించటం సులభం. 
  • మనల్ని ఎంపిక (hire) చేసుకునే management ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ resume లో కెరీర్ గ్యాప్ ఉంది దానికి గల కారణం ఏంటని? అడిగినప్పుడు మీరు సరైన/తగినట్టు  కారణం చెప్పి గ్యాప్ ఉన్నప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న, అలాగే నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినా రోల్ కి కావలసిన స్కిల్స్ ని నేర్చుకున్నానని, దానికి సంబంధించిన ఇంటర్న్షిప్స్ చేసానని కూడా చెప్పవచ్చు. 
  • మీరు ఇచ్చిన సమాధానానికి Hiring team ఇంప్రెస్స్ అయ్యే అవకాశం కూడా ఉంది.   
S,noPlatformLink
1Udemyclick here
2Coursera click here
3Google learningsclick here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!