Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

  Tsunami”

Written by; Nani Nestham Published on; Twinkle Talks

                     ఒక సాయంకాలం వేల, సూర్యుడు నులి వెచ్చని కిరణాలతో భూమిని kiss చేస్తున్న సమయం. 

అంతా సందడి, పిల్లల కేరింతలు, మనస్సు నిండా ఆనందం, పడచు వాళ్ళ కొంటె చూపులు, ఈ function అయ్యే లోపు mingle అవ్వడానికి try చేస్తున్న singles.

ముసలివాళ్ళ ముచ్చట్లు, భార్యలను  కంట్రోల్లో పెట్టామని భావించే మొగుళ్లు

function అయ్యాక  ఎక్కడ sitting వెయ్యాలో plan రెడీ చేస్తున్న uncles

ఫుల్ గా తాగి వచ్చిన మొగుళ్ళను ఎలా కొట్టాలో ఆలోచిస్తున్న aunties.

 బంధువుల్ని ఆ పలకరింపుని ఒక world war లా feel అవుతున్న introverts

ఇలాంటి సన్నివేశాల మద్యన ఎప్పుడు భోజనాలు start చేస్తారో wait చేస్తున్న ఒకే ఒక గొప్ప వ్యక్తి, ఎవరో కాదు నేనే.

hello

చాలా రోజుల తరువాత బంధువులని కలుసుకున్నందుకు సంతోషంగా వుంది నాకు.

 కానీ wait a minute ఎదో, ఏదో, ప్రమాదం, అవును ఏదో ప్రమాదం, వామ్మో సునామీ రాబోతుందని నా heart కి  signals అందుతున్నాయి, అవును సునామీనే…

కరువుకు c/o అయిన మన ఊరిలో సునామీ ఏంటి అని నా mind ప్రశ్నించింది?

సముద్రం నుంచి వచ్చే సునామీ కాదురా బాబు ప్రశ్నల రూపం లో వచ్చే సునామీ, ready గా వుండు ఫేస్ చెయ్యడానికి heart clarity ఇచ్చింది.

దాని గురించి ఆలోచించే లోపే 

“ఇప్పుడు ఏం చేస్తున్నావురా”?  అనే bomb పడింది దెబ్బకి నాలోవున్న సంతోషం ముక్కలైంది.

వెనక్కి తిరిగి చూసా ..

మా మామయ్య

Job searching మామ అని చెప్పా,

అవునా… అనింది అత్త,

all the best చెప్పింది మరదలు,

అక్కడ నుంచి తప్పించుకొని ఇంటి లోపలికి  వెళ్ళాను

“ఇప్పుడు ఏం చేస్తునావు రా ?” అడిగింది మా అత్త వాలా పక్కింటి ఆంటీ, job కి prepare అవుతున్న ఆంటీ, మంచిది బాబు అన్నది మహాతల్లి.     

నాకు కంపెనీ ఇచ్చేందుకు ఎవరు లేరు ఫంక్షన్ లో

కనీసం tea తాగుదామని kitchen room లోకి వెళ్ళాను నేను చేసిన పెద్ద పొరపాటు

నిన్న జరిగిన సీరియల్ ఎపిసోడ్ లో హీరోయిన్ కట్టుకున్న చీర గురించి discussion పెట్టిన లేడీస్ అందరూ వంట చేస్తూ అక్కడే వున్నారు.

ఏరా అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నావు ? అడిగింది ఒక  aunty,

కాలీనే అని చెప్పటం ఇష్టం లేక government jobs కి ప్రిపేర్ అవుతున్న అని చెప్పాను,

ఇంతలో supplies క్లియర్ అయ్యాయ? అనుమానంతో కూడిన ప్రశ్న అడిగింది గిల్ల కొద్ది నా cousin

ఎప్పుడో క్లియర్ అని చెప్పి వెళ్లబోతుంటే

ఏం  గవర్నమెంట్ jobs రా?

shh ఇంకో ప్రశ్న

post office లో జాబ్ కోసం అన్నాను , నువ్వు చదివిన దానికి దీనికి ఏంటిరా సంబందం? ఆశ్చర్యంతో కూడిన ప్రశ్న?

ఇప్పుడు ఇదే ట్రెండ్ పిన్ని మనం చదివిన దానికి చేసే జాబ్ కి సంబందం వుండదు, అని ah సునామీ నుంచి  బయటకు వచ్చేశా.

ఇక్కడ అయితే safe కాదు అనుకోని మేడపైకి వెళ్ళాను

అక్కడ ice cream కావాలని అడిగిన మా చెల్లికి ice cream తినటం వల్ల పళ్ళు ఎలా పుచ్చిపోతాయో వివరిస్తున్నాడు మా బాబాయి నోట్లో పాన్ నములుతూ

ఏరా నాన్న జాబ్ కొట్టావా? ఆశతో అడిగాడు

next week notifications release అవుతుంది బాబాయి, తరువాత exam ఆ తరువాత interview next job eh balance అన్నాను

ప్రతిసారి ఇదే చెబుతున్నావ్ ఏంట్రా ఈ సారి ఎలాగైనా కొట్టాలిరోయ్ లేదంటే

అని చెప్పి క్రిందకు వెళ్లిపోయాడు.

సరే బాబాయి అన్నాను.

జేబులో ఎప్పుడు వుండే earphones బయటకు తీశాను

Earphones పెట్టుకొని, తెలుగు రాని సింగర్ పాడిన తెలుగు సూపర్ హిట్ పాటను repeat mode లో వింటూనే వున్నాను

function అయ్యాక భోజనాల time కి కిందకు వచ్చాను, కొద్ది సేపు serve చేసి నేను plate తీసుకున్నాను

 ఇంతలో ఎప్పుడు చూసినట్టుగా కూడా గుర్తుకు రాని ఒక ఫ్యామిలి వచ్చి

ఏరా ఇప్పుడు ఏమి చేస్తున్నావు? అని అన్నారు

control control

 Techi Status Uploader job అని చెప్పాను,

 oh very good అని బుజం తట్టి వెళ్ళిపోయారు అది ఏదో హై profile జాబ్ అనుకోని, కానీ దాని అర్దం watsup లో status upload చేస్తుంటా అని తెలీదు వాళ్ళకి,

 భోంచేశాక  కుర్చీలో కూర్చొని ice తింటూ కళ్ళకి పని చెప్పాను

ఇంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేసి supply exams కి notification వచ్చిందిరా spectrum తీసి పెట్టు అన్నాడు,

Shhhhh భగవంతుడా … ఏమిటి ఈ శిక్ష నాకు

omg

సునామీ (Tsunami) నుంచి తప్పించుకొని బురదలో పడినటైంది కథ, ఇంకా అక్కడ వుండలేక  సగం తిన్న ice cream ని పాడేసి బైక్ start చేశాను,

ఇప్పుడెక్కడికి రా నాన్న, రేపు తెల్లవారుజామున వెళ్దువులే అని నన్ను ఆపింది మా అమ్మ సంతానం లేని పెద్దమ్మ

లేదు పెద్దమ్మ వెళ్ళాలి నేను అన్నాను, నా వ్యధ గమనించి 1000/- చేతిలో పెట్టింది, డబ్బులు తీసుకొని self-start చేశా అంతే ………

Alarm మోగింది, సాయంత్రం వెళ్లబోయే ఫంక్షన్ లో ఎదురయ్యే సునామిని కలలో చూపించాడు దేవుడు

oh god thank you అనుకున్న.

 నేను సాయంత్రం ఫంక్షన్ కి రాను నాకు పని వుంది అని చెప్పా అమ్మకి,

ఆ మాటలు విన్న మా కుక్క పిల్ల నవ్వుకుంది మనసులో……ఎందుకో మరి!

{ ఫ్యామిలి functions కి, events కి attend అవ్వలేకపోతున్న ఎందరో ఎందరెందరో VIP’s కి, మరియు supply warriors కి Twinkle Talks ఈ Article అంకితం చేస్తుంది}

Note : ఏదైనా బాదను పదిమందికి పంచుకుంటే తగ్గిపోతుంది అంటారు, నేను మీతో పంచుకున్నాను మీరు కూడా నా భాదని వేరేవాలకి share చేసి పంచుకోండి.

_/\_ సెలవు _/\_

మరిన్ని

  1. ప్రియమైన నీకు 1.

2. ప్రియమైన నీకు 2

3. మరిన్ని వాటి కొరకు >>>> Twinkle Talks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!