ప్రియమైన నీకు 1

Share to others

                                                Priyamaina Neeku 1

Written by NDK’S, Published on Twinkle Talks

        నీకు అంటే ఎవరు అనుకుంటున్నవేమో ఎవరో కాదు నువ్వే నా పొట్టి బుజ్జి బంగారంకు

నీ ప్రేమకు దాసోహమైన నీ బుజ్జి వ్రాయు లేఖ. ఇది ప్రేమలేఖ అంటారో లేదో నాకు తెలీదు, అసలు ప్రేమలేఖ చదవడం రాని నేను ఒక లేఖ రాస్తున్నాను అంటే నమ్మగలవా?

         నేనే నమ్మలేను, కానీ నా హృదయం నీతో ఏదో చెప్పాలని, ఏదో వ్రాయాలని మనసంతా  తహతహలాడుతుంది.

ఈ ప్రపంచంలో దేనినైనా దాచుకోవడానికి అన్నిటికన్నా విశాలమైనది భద్రమైనది హృదయం అలాంటి హృదయాన్ని నీవు దోచుకొని దానికి భద్రత లేకుండా చేసావు ఇది ఏమన్నా న్యాయమా చెప్పు?

  నువ్వంటే నాకు ప్రేమ మాత్రమే కాదు పిచ్చి కూడా, ఎందుకు అంటావా?

   “ ఆ ఒక్కటి అడక్కు”

   నీలో నాకు నచ్చింది చెప్పాలి అంటే….,

                       రంభ , ఊర్వశి, మేనకను మించిన అందం

                       పసిపిల్ల లాంటి నీ నిర్మలమైన నీ మనస్సు

                       జలపాతం లాంటి నీ జడ, నీ నవ్వు

                       తామర పువ్వులాంటి నీ కళ్ళు

                       చిలక పలుకులు, కోతిని మించిన అల్లరి  

    అంతెందుకు,

                     Nagarjuna sagar లాంటి నీ ముక్కు అన్న నాకు భలే పిచ్చి,

                     చూశావా, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితకాలం

                     వ్రాసుకుంటుపోతే ఒక మహాగ్రంధం కూడా సరిపోదు, పోనీ,

                     నాకు నీపై వున్న ప్రేమను చూపించు అంటావా? అది అసాధ్యం, కారణం,                                                                                                           

    నీ ప్రేమ ముందు నా ప్రేమ

                            సముద్రం నుంచి వచ్చే చిన్న అల

                            ఆకాశంలో కనిపించే మేఘం

                            అగ్ని లావా లోంచి పుట్టే నిప్పురవ్వ

                           తుఫాను ముందు మనం తుమ్మే తుమ్ము లాంటిది

   ఒక్క మాటలో చెప్పాలంటే – ప్రపంచం లో ఎన్నో కోట్ల మంధి భగవంతులు వున్న నేనే నిజమైన    దేవుణ్ణి అనుకునే ఒక పిచ్చి స్వామీజీని రా నేను.

నా ప్రేమ విషయం నీకు చెపితే ఎక్కడ మాట్లాడవో అని భయం, లోడ లోడ వాగే నీ పెదాలు మౌనంగా ఉండిపోతాయేమోనని భయం , నా హృదయానికి ప్రాణం పొసేది నీ మాటలే కాబట్టి నీ మాటల ప్రవాహం నీ నవ్వుల జల్లులు ఆగకూడదు, నా జీవితపు కారుమబ్బులను తొలగించేది నీ నవ్వులే కనుక.

    ప్రతి జన్మలో మనం ఎంతో మందిని కలుస్తాం, మాట్లాడుతాం, పోట్లాడుతాం, ఇంకా చెప్పాలంటే చాలా మందిని ఇష్టపడి కొంతమందిని ప్రేమిస్తాం కూడా కానీ, పెళ్లి మాత్రం ఒక్కరినే చేసుకుంటాం.

ఆ ఒక్కరు నువ్వే కవాలనేది నా ఆశ.

       నా మనస్సు నీ గురించి ఏం అంటుందో తెలుసా…..?

                  నీ పరిచయం మళ్ళీ దొరకని అవకాశం

                  నీ చూపు ఒక తియ్యని అనుభూతి

                  నీ ప్రేమ ఊహించని వరం

                  మరీ, నీతో వివాహం? అది నా చిరకాలపు కోరిక రా బంగారం.

    నీ చిటికన వ్రేలు పట్టుకొని, ఏడు అడుగులు నడిచే అవకాశం నాకు ఇవ్వు బుజ్జి.

ఒక నిమిషం నా మనస్సులో ఒక్క క్షణం నా ఆత్మలో ఉండి చూడు నీకే తెలుస్తుంది నా మనస్సులోని భావమేమిటో.

వెయ్యి జన్మలకు సరిపడా ప్రేమను ఇస్తూ, కష్టం అన్న మాట నీ కనుచూపు మేరలో లేకుండా చేస్తూ, నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను.

గుర్తుపెట్టుకో…

                My heart & the doors of my kingdom are always ready for you to welcome  into my life.

                Maybe my kingdom is small when compared with others. But, you will be the one & only “queen” of my kingdom.

                       సూర్యుని కాంతి,

                       చంద్రుని అందం

                       ఆకాశం పొడవు,

                       భూమి లోతు

వర్ణించడం ఎంత కష్టమో, నాకు నీపై ఉండే ప్రేమ ( నిజానికి నీకు నాపై ఉన్న ప్రేమ) చూపించడం కూడా అంతే అసాధ్యం.

అయినప్పటికి,

               నీపై నా మనసులో ఉన్న ప్రేమను నువ్వు ఏనాటికైనా గుర్తిస్తావని ఆశిస్తూ, ఈ జన్మంతా నీ ప్రేమకు ఋనపడి ఉంటా, ఎల్లప్పుడు నిన్ను కాపాడుతూ, ప్రేమిస్తూ, స్మరిస్తూ, ఉంటానని నీకు మాటిస్తూ – ప్రస్తుతానికి సెలవు తీసుకుంటు.

  • నీ చిరకాల ప్రేమికుడు NDK’S

Written by – NDK’S

    Note: This article (love letter) is written by a boy named as NDK’S, He is proposing to his Office colleague on Valentines Day, 14-02-2020, by giving this love letter, at Bangalore, India. Best of luck from twinkle talks.

మరిన్ని చదవండి:

  1. ప్రియమైన నీకు 2

2. మా తుజే సలాం

               

                                   

                                                       

Leave a Reply

Your email address will not be published.

2020 Oscar Award Winners List

10th February 2020

Corona Virus (COVID-19)

21st March 2020

error: Content is protected !!