మన్నించు ఓ ప్రేమ – ఇదే నా ప్రేమకు ముగింపు – ప్రియమైన నీకు – 2

Share to others

మన్నించు ఓ ప్రేమ – ఇదే నా ప్రేమకు ముగింపు. “Priyamaina Neeku 2”

Written by 132N1A0354 , Published on www.twinkletalks.com

Please First Read >>>> ప్రియమైన నీకు 1

ప్రియమైన నా పొట్టి బుజ్జి బంగారంకు, నిజానికి నిన్ను ఇలా పిలిచే అర్హత నేను కోల్పోయాను. ఇది నేను రాస్తున్న రెండవ ప్రేమ లేఖ. మొదటిది  ప్రేమ లేఖ అయితే రెండవది నా చిట్ట చివరి లేఖ ఎందుకంటే ఇది నా వీడ్కోలు లేఖ.

నేను రాసిన మొదటి లేఖ అప్పుడు నా కళ్ళ నుంచి వచ్చిన నీరు ఆనందంతో వచ్చిన ఆనంద భాష్పాలు, ఇప్పుడు నా కళ్ళ నుంచి అవే నీరు వస్తున్నాయి కాకపోతే ఈసారి ఆనందంతో కాదు బాధతో వస్తున్న కన్నీళ్లు.

Photo by mali maeder from Pexels

ప్రేమించిన మనిషి సంతోషం కోసం ప్రేమను ప్రేమించిన మనిషినే వదులుకోవడాన్ని త్యాగం అంటారో ? స్వార్ధం అంటారో ? నాకు తెలియదు. నేను మాత్రం నువ్వు నాతో ఉంటే సంతోషంగా ఉండలేవు అన్న నిజాన్ని అర్థం చేసుకున్న అందుకే ఎంతో అందమైన రామ చిలుక లాంటి నిన్ను ప్రేమ అనే పంజరం నుంచి విముక్తి కలిగించి నీకు స్వేచ్ఛను ఇవ్వాలని నిర్ణయుంచుకున్నాను.

Priyamaina Neeku 2″

నేను ఏదో నీ సంతోషం కోసం వదిలేస్తున్న అని, నేనేదో గొప్ప వాడిని అని, లేకుంటే పిచ్చి వాడిని అని ఈ సమాజం అనుకుంటుంది. నిజానికి గొప్ప వాడిని కాదు, పిచ్చి వాడిని అంతకన్నా కాదు, ఒక మోసగాడిని. అవును నువ్వు నిజంగా నాకు దక్కాలి అని నాకు ఉండి ఉంటే లైఫ్ లో బాగా సెటిల్ అయ్యి మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడి అందరిని ఒప్పించే ప్రయత్నం చెయ్యాలి, కానీ నేను అది చెయ్యలేదు. నువ్వు ఒక్క రోజైన ఇదే ప్రశ్న వేసుంటే మనం ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్లం కాదేమో!

కానీ నా ప్రేమ, నీకు తెలీదు నేను నిజంగానే నీ కోసం చాలా ట్రై చేశాను, మంచిగా సెటిల్ అవ్వాలని, కానీ పరిస్థితులు అన్ని ఒక్కసారిగా మారిపోయాయి,ప్రపంచం మొత్తం తల క్రిందులు అయిపొయింది, నేను అనుకున్నది ఏది జరగలేదు చివరకు నేను ఊహించిన విధంగా నువ్వు ఇంకొకరితో వెళ్ళిపోతున్నావు. జీవితంలో ప్రేమ అనేది ఒక్క భాగం మాత్రమే అని నిన్ను మర్చిపోయి లైఫ్ లో ముందుకు వెళ్లాలో ? లేక ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన మనిషే మనతో లేనప్పుడు మనం బ్రతకవలసిన అవసరం లేదు అని చచ్చిపోవాలో అర్థం కానీ టైం లో  మనం అందరి నోటా వినే ఒక మాట గుర్తుకు వస్తుంది అది “నిన్ను కాదని వెళ్లి పోయిన అమ్మాయి కోసం నువ్వే సర్వం అని ఇంటి దగ్గర నీ కోసం ఎదురుచూస్తున్న వాళ్లను మర్చిపోయి నీ ప్రాణం తీసుకోకు అని”. 

నిజమే కదా ఈ పిచ్చివాడు ఎదుగుదలని చూడాలని మన కుటుంబం ఓ క్షమించు నా కుటుంబం కూడా ఆశపడుతుంటాదిగా, ఎటువంటి స్వార్ధం లేని స్వచ్ఛమైన ఆశ. ఆ ఆశను నెరవేర్చడం నా బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడంలో ఈ బాధను జయించాలని కోరుకుంటూ – నీ చిరకాలపు ప్రేమికుడిలా మిగిలిపోదాం అనుకొని కేవలం ఒక అపరిచితుడిలా మిగిలి పోతున్న ఒక సాదా సీదా పిచ్చి ప్రేమికుడిని.

Photo by Flora Westbrook from Pexels

గమనిక : ఈ జంట ప్రేమలో విఫలం కాలేదు, వాళ్ళ జీవితంలో వచ్చే మరొక అధ్ధ్యాయంలో కలిసి జీవించడం లేదు అంతే.

“ప్రేమించిన మనిషి మధురం అయితే ప్రేమ ఎప్పటికి మధురమే”. కాబట్టి, ప్రేమ పైన మీకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు, స్వచ్చమైనా మనసుతో ప్రేమించి చూడు దాన్ని విలువ తెలుస్తుంది.

Keep loving people with lots of smiles and belief. Thank you.

NDKS. 

Featured Photo by Acharaporn Kamornboonyarush from Pexels

Read Also:

  1. Priyamaina neeku – 1

2. Maa Thuje Salaam :

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!