Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

అందరికీ నమస్కారం twinkletalks.com కి స్వాగతం. (Movies about Mother’s Love).

Written by నాని నేస్తం – Published on Twinkle Talks

August 4th – “Single Working Women’s Day” సందర్భంగా

గాయత్రి టీచర్:

నేను 6th క్లాస్ అప్పుడు కొత్త స్కూల్లో చేరవలసి వచ్చింది, అడ్మిషన్ కోసం ప్రిన్సిపల్ రూంలో నేను మా పేరెంట్స్ తో ఉండగా అప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ (Admission Process) కంప్లీట్ చెయ్యడానికి ఒక టీచర్ వచ్చింది ఆ టీచర్ పేరే గాయత్రి. మా పెద్దమ్మ గారి వయస్సు వుంటుంది ఆమెకు. ఆశ్చర్యం ఏమిటంటే మా డాడికి గాయత్రి టీచర్ ముందుగానే తెలుసు. “అక్కా ఎలా ఉన్నావు?” అని పలకరించి నా గురించి చెప్పాడు, తెలిసిన వారి అబ్బాయి కాబట్టి నా మీద ఇంకా ఎక్కువ కేర్ తీసుకునేది.

నేను 10th క్లాస్ లో ఉండగా గాయత్రి టీచర్ స్కూల్ కి రావడం మానేసింది, ఎవరిని అడిగిన కారణం తెలియదు అంటున్నారు మా టీచర్స్ మాట్లాడుకుంటుంటే తెలిసింది ఏమిటంటే పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని. కొన్ని రోజుల తరువాత మా ఇంట్లో ఒక వెడ్డింగ్ కార్డ్ చూశాను అందులో పెళ్లికూతురి పేరు గాయత్రి అని వుంది, మా పక్కింటి అమ్మాయి పేరు కూడా గాయత్రినే! ఒక్క సారి కంగారుపడ్డాను, మా అమ్మని అడిగితే మీ గాయత్రి టీచర్ గారిదేరా పెళ్లి అని చెప్పింది. What? గాయత్రి టీచర్ కి పెళ్ళా? ఆమెకు ఇంతకు ముందే పెళ్లి కాలేదా ? ఇన్ని రోజులు పెళ్లి పన్నుల్లో బిజీగా ఉన్నారంటే వాళ్ళ కూతురిదో కొడుకుదో అనుకున్నాం కానీ టీచర్ గారికే పెళ్ళా? టీచర్ గారికి ఇంచుమించు 50 సంవత్సరాలు ఉంటాయి, ఆమెకు ఇంత వరకు పెళ్లి కాలేదన్న సంగతి ఇప్పటి వరకు మా ఫ్రెండ్స్ లో ఎవరికి తెలియదు. మా డాడీని ఈ విషయం గురించి అడిగితే అప్పుడు చెప్పారు గాయత్రి టీచర్ గురించి.

గాయత్రి టీచర్ కి ఇద్దరు సిస్టర్స్ ఒక తమ్ముడు, వారిలో గాయత్రి అక్క అందరికంటే పెద్దది, వాళ్ళ నాన్న గారికి పెరాలసిస్ వచ్చి మంచంలోనే ఉండిపోయారు, భాద్యతలు మొత్తం తనమీదే పడ్డాయి. మిగితావారి చదువులు, పెళ్లిళ్లు చెయ్యడంలో తల్లి పాత్ర తండ్రి పాత్ర పోషించటంలోనే సరిపోయింది. ఇంకా మంచి కాలం వచ్చింది అని అనుకునే లోపే తన తల్లి చనిపోయింది, ఒక్కసారి ఆలోచించు ఒక స్త్రీ మంచంపైన ఉన్న తన తండ్రికి అన్నీ రకాల సేవలు ఎవరి సహాయం లేకుండా చెయ్యటం అంటే ఎలా వుంటుందో. పెళ్లి సంబంధాల్లు ఎన్ని వచ్చిన సంపాదించే అమ్మాయి అని ఒప్పుకున్న తనతో పాటు తన తండ్రిని అత్తవారింటికి తీసుకువస్తాను అంటుంటే ఎవ్వరికీ నచ్చక ఆశ్రమం లో పెట్టడం ఇష్టం లేక ఏ సంబంధం కుదరక అలా ఉండిపోయింది కానీ పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఏ అమ్మాయికైనా తన తండ్రే కదా ఫస్ట్ సూపర్ హీరో. కొన్ని రోజులకి తన తండ్రి చనిపోయాక ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడిందని ఇప్పుడు దేవుడి దయ వలన సంబందం కుదిరింది అని చెప్పాడు. ఆది విన్న నాకు ఏదో పాత సినిమాను చూసినట్టు ఉంది, బహుశా సినిమాలు నిజ జీవితాలనుంచే తీసుకుంటారేమో. ఎప్పుడు నవ్వుతూ కనిపించే గాయత్రి టీచర్ నవ్వు వెనక ఇంతటి కష్టాలుంటాయని తెలియదు. కష్టాల ఊబిలో ఉండే తను ఒక్కసారిగా తనలాంటి తోడు దొరుకుతుందని తెలిసిన సమాజం దిష్టి పెట్టిందో ఏమో ఆ కొత్త భాంధవ్యం ఎక్కువ కాలం నిలువ లేదు. టీచర్ మళ్ళీ Single Working Woman గా మారింది.

ఇలాగే ఎందరో మహిళలు తమ కష్టాన్ని బయటికి చెప్పకుండా తమలో తామే ఆ భాధని భరిస్తూ పైకి చిరునవ్వు నవ్వుతుంటారు. ఎలాంటి పరిస్థితులో అయిన ఆత్మ గౌరవమే సింహాసనముగా భావిస్తూ ఎవరి తోడు లేకుండా వారు జీవిస్తూ లేదంటే వారి పిల్లలను పోషిస్తున్న మహిళలను చూస్తే ఒంటరి తనానికే ధైర్యం వస్తుంది. ఇలాంటి వారి కోసమే ప్రతి సంవత్సరం “Single Working Women’s Day” జరుపుకుంటారు.

ఎలా జరుపుకోవాలి?

  • మీకు తెలిసిన వారిలో ఇలాంటి మహిళలు ఉంటే వారికి ఇలాంటి ఒక Single Working women’s Day ప్రతి సంవత్సరం ఆగష్టు 4వ తేదీన జరుపుకుంటారని వారికంటూ ప్రత్యేకంగా ఒక రోజు ఉందని చెప్పండి.
  • వారి ధైర్యం ఇతరులకు ఇన్స్పిరేషన్ అని వారి పట్ల మీకు ఉన్న ప్రేమ, అభిమానం తెలియజేయండి.
  • ఇంకెప్పుడూ పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇలాంటి వారిపైన నిందలు వెయ్యడం కానీ చులకనగా చూడటం కానీ చెయ్యొదండి.
  • వీరికి మాత్రమే ఉండే ఒక ప్రత్యేకత ఏమిటంటే “Happy Mother’s Day” మరియు Happy Father’s Day రెండు రోజుల్లో wishes చెప్పించుకునే అర్హత ఉంటుంది.

కొన్ని కుటుంబాలలో తండ్రి సంపాదిస్తుంటే తల్లి ఇంటి పనులు చేస్తుంటుంది కొన్ని కుటుంబాలలో ఇద్దరు పని చేస్తుంటారు, కానీ కొన్ని చోట్ల తండ్రి వుండడు తల్లి మాత్రమే పని చేసి పిల్లలని పోషిస్తూ వుంటుంది.

ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సినిమా కూడా ఆ కోవకు చెందినదే.

సినిమా వివరాలు :

సినిమా పేరుఉదాహరణం సుజాత (udhaharanam sujatha)
భాషమలయాళం
నటి, నటులుమంజు వారియర్, అనశ్వర రాజన్, మమతా మొహందాస్
ధర్శకత్వంఫాంటోమ్ ప్రవీణ్
నిర్మాతమార్టిన్ ప్రక్కట్, జోజు జార్జ్
అవార్డ్స్asian film award for honour special jury, filmfare award for best actress-south

(Movies about Mother’s Love)

సినిమా ట్రైలర్:

trailer

    ఈ సినిమా తల్లి కూతురుల మధ్య జరిగే కథ.

        సుజాత కృష్ణన్  (మంజు వారియర్) కొన్ని ఇళ్ళలో పనిమనిషిగా పని చేస్తూ కూతురుని(అతిర కృష్ణన్ ) చదివిస్తుంటది, తన భర్త చనిపోవటం వల్ల తన సంపాదన  మీదే కుటుంబ పోషణ జరుగుతుంది.

       కానీ, పదవ తరగతి (10th class) చదువుతున్న తన కూతురు సరిగ్గా చదవటం లేదని తెలుసుకొని తన భవిష్యత్తు పైన బెంగ పెట్టుకుంటుంది. తను పని చేసే ఒక ఇంటి యజమాని సలహా మేరకు తను కూతురు చదివే స్కూల్ లోనే తను చేరుతుంది, కానీ వారిద్దరు తల్లి కూతురులు అని ఎవరికి తెలీదు, తన అమ్మ చేసిన పనికి చాలా కోపం వస్తుంది అతిరకు బడికి రావోద్దని, వస్తే తను ఇంట్లో నుంచి వెళ్లొపోతనని హెచ్చరిస్తుంది.

     బడికి రాకుండా వుండాలంటే తను వేసిన  పందెం గెలవాలని ఒక బెట్ (bet) వేస్తుంది సుజాత, సరే అని చెప్పి పందెం కు ఒప్పుకుంటుంది తన కూతురు, చివరకు ఏమైనదని తెలుసుకోవటానికి సినిమా చూడండి.

మలయాళం మాకు రాదు కదా ఎలా అర్దం అవుతుంది అని అనుకోకండి hotstar లో e****** s******** కూడా వున్నాయి.

    తన బిడ్డ భవిష్యత్తు కోసం పాటుపడే తల్లి పాత్రలో మంజు వారియర్ చాలా బాగా నటించారు.

ఈ సినిమా హింధి మూవీ “నిల్ బట్టే సన్నాట” (nil battey sannata) కు అనువాదం.

ఈ సినిమాలో తల్లి కూతుళ్లుగా స్వర భాస్కర్ , రియా శుక్ల నటించారు

సినిమా వివరాలు:

సినిమా పేరునిల్ బట్టే సన్నట (nil battey sannata)
భాషహింది
ముఖ్య పాత్రలుస్వర భాస్కర్, రియా శుక్ల 
ధర్శకత్వంఅశ్విన్ అయ్యర్ తివారీ
నిర్మాతలుఆనంద్ రాయ్, అజయ్ రాయ్, అలెక్స్

ఈ సినిమాకి చాలా అవార్డ్స్ వచ్చాయి. హింధి లో వచ్చిన తరువాత తమిళ్ మలయాళం లోకి రీమేక్ అయ్యింది.

తమిళ్ లో ఈ సినిమా “అమ్మ కనక్కు” (amma kanakku)

అనే పేరుతో ధనుష్ మరియు ఆనంద్ రాయ్ నిర్మించారు. ఇళయరాజా గారు సంగీతం అందించారు.

ఇందులో తల్లి కూతుళ్లుగా అమలపాల్ మరియు యువశ్రీ నటించారు.

ఏ భాష లో తీసిన బిడ్డ భవిష్యత్తు కోసం తల్లి పడే ఆరాటం స్పష్టంగా మన మనసుకు కనిపిస్తుంది.

ఆ తల్లి హృదయానికి తెలుసు చదవకుంటే తన లాగే వేరే ఇంట్లో పాచి పని చెయ్యాలని, భర్తలేని జీవితంలో తనకున్న ఏకైక వెలుతురని, తన ఒంటరి మజిలీలో  తనవైపు చూసే ఆకలి చూపులకి తన కూతురు బలి కాకూడదని, చదివించాలి బాగా చదివించాలి అందరికన్నా ఎక్కువ చదివించాలి, తన బిడ్డ ఒక్క ఉన్నత స్థానంలో ఉండటం తను చూడాలి, తనలాంటి ఒంటరి మహిళలకు ఉపాధి కల్పించాలి, బాగా చదివించాలి. ఆ తల్లి పోరాటం తన బిడ్డ బాగుకోసం ఆ తల్లి పోరాటం తనలాంటి కష్టానికి గురి అవుతున్న ఒంటరి మహిళల కోసం.

తన పిల్లలు బాగా చదివించాలని ప్రతి తల్లికి ఉంటుంది, అదే ఆ తల్లి మధ్యతరగతికి చెందినది అయితే, అలాగే ఆ తల్లి భర్తని కోల్పోయిన వ్యక్తి అయితే ఆ బిడ్డని చదివించడం ఎంత ముఖ్యమో కదా? పొట్టకూటి కోసం పది పనులు చేసుకునే తల్లి చేసిన పోరాటం నేటి సమాజపు ఆడపిల్లలకు చదువు ఎంత ముఖ్యమో తెలియజేప్పే చిత్రమే ఈ సినిమా. బంగారు భవిష్యత్తు కోసం ఆ సరస్వతి తల్లిని నమ్ముకుంటే ఎప్పటికైనా పది మందికి ఉపాధి కల్పించగలరు, ఎన్నో ఇంటి దీపాల వెలుతురికి  జీవం పోయగలరు. 

తన సంపాదనతోనే పిల్లలని పోషిస్తున్న ఇలాంటి ఎందరో తల్లులకి Twinkle Talks చేస్తుంది పాదాభివందనం.


Featured Photo by August de Richelieu from Pexels

6 thought on “తల్లి పోరాటం”
    1. Yes Yasmin Madam its really a nice story, please share this article to your friends and give support to “Twinkle Talks”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!