Happy New Year 2024 - Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this March, 2024 - Enjoy the Articles
Share to others

మహోన్నతికి మార్గదర్శకాలు – 2 | The Greatness Guide 2 book in Telugu

ఈ బుక్ మహోన్నతికి మార్గదర్శకాలు సిరీస్ లోని రెండవ పుస్తకం. (The Greatness Guide 2 book in Telugu).

బ్లాగ్ పోస్ట్ రచన : Prakash. K ——- పబ్లిషింగ్ ఆన్: Twinkle Talks

మీరెప్పుడైనా  అనుకున్నార ? అర్ధరాత్రి మీరు నిద్రపోతున్నపుడు 12 గంటలకు మీకు విలువైన సంపధ లభిస్తే , మీకు మాత్రమే కాదు ప్రజలందరికీ ఆ సంపధ లభిస్తే?

ఆ సంపధ ద్వారా మీరు పొందే మంచి ఫలితాలకు కృతజ్ఞత కలిగి వుంటారా?

మీకు తెలుసో లేదో కానీ ప్రతిరోజూ మీకు ఆ విలువైన సంపద మీతో పాటు ప్రాణం వున్న ప్రతి జీవికి లభిస్తుంది.  అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

హలో everyone, twinkletalks.com కి స్వాగతం.

ఈ రోజు మనం రాబిన్ శర్మా గారు రచించిన మహోన్నతికి మార్గదర్శకాలు-2”  అనే పుస్తకం గురించి మాట్లాడుకుందాం.

పుస్తకం వివరాలు: (Book Details)

పుస్తకం పేరుమహోన్నతికి మార్గదర్శకాలు -2
రచయితరాబిన్ శర్మా
ప్రచురణ కర్తలుజైకో పబ్లికేషన్స్
The Greatness Guide 2 book in Telugu
The Greatness Guide 2 book in Telugu
The Greatness Guide 2 book in Telugu

పేరుకు పార్ట్-1 పార్ట్-2 అని వున్న టోపిక్స్ ఏమి continuation కాదు.  బుక్ లో కూడా పార్ట్-1 బుక్ లో వున్నట్లుగానే 101 topics వున్నాయి, అందులోనుంచి కొన్నిటి గురించి అందరికీ అర్దమయ్యేలా వివరిస్తాను. (The Greatness Guide 2 book in Telugu).

  1. తాజా సంపధ

మనం ముందుగా చెప్పుకున్నట్టు మీరు నిద్ర పోతున్నప్పుడు అర్దరాత్రి 12 గంటలకు విలువైన సంపధ లభిస్తే చాలా సంతోషిస్తారు కదా! మీకు తెలుసో తెలీదో కానీ ఆ సంపద మన ప్రమేయం లేకుండానే అందరికీ లభిస్తుంధి. 

నగలరూపంలోనో, డబ్బు రూపంలోనో, షేర్ మార్కెట్ లో విలువైన షేర్ల రూపంలోనో ఆ కంపెనీలు ఇచ్చే డివిడెండ్ రూపంలోనో అస్సలు కాదు.

సమయం రూపంలో, అవును ఆ సంపదే తాజా 24 గంటలు.

ఓరినీ….. అనుకోవద్ధు మనకు ప్రతి రోజు లభించే ఆ సమయం ఏదైతే వుందో దానిని సద్వినియోగం చేసుకుంటూ  పైన చెప్పిన డబ్బు, నగలను , etc., దక్కించుకొనే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

మనలో చాలామంది డబ్బుని, ఇల్లుని, కార్, బైక్ లను మాత్రమే ఆస్తులుగా భావిస్తారు కానీ సమయం(time) ని అస్సలు విలువైన ఆస్తిగా అస్సలు అనుకోరు.

ఎవరినైనా ముసలివాళ్లను మీరు కానీ జీవితంలో వెన్నకి వెళితే ఏమి చేస్తావు? అని అడిగితే “ అయ్యో! నేను అప్పుడు చాలా చెయ్యాలనుకున్నాను కానీ టైమ్ కుదరక కొన్ని సార్లు, టైమ్ వేస్ట్ చేసి కొన్ని సార్లు ఏమి చెయ్యలేకపోయాను” అని బాధపడుతుంటారు.

మనo కూడా తెలిసో తెలీకో ప్రతిరోజూ వచ్చే సమయం (24 గంటలు ) అనే సంపదను ఉపయోగించకుండా వుంటాము, కానీ ఇప్పటినుంచి ఆ సంపదను సంతోషంగా వాడుకొని ఉన్నతంగా జీవిద్దాం.

కొంతమంది తక్కువ టైమ్ లో ఎక్కువ పనులు కంప్లీట్ చేస్తూ happy గా ఉంటారు వారికి time management మీద పట్టు ఉంటుంది కానీ మనలో కొంతమంది time management లో అస్సలు control & concentration ఉండదు ఎందుకంటే వారు సమయాన్ని ఒక ఆస్తిలాగా భావించరు కాబట్టి

     మనకి రోజు లభించే  ఆ తాజా 24 గంటల్లో మనం 5 గంటలకు లేచి 10 గంటలకి పడుకున్న 7 గంటలు నిద్రలోనే వెళ్లిపోతాయి సహజం

 అంతలేదు నేను లేచేదే 8 కి,  9 కి అలాగే, పడుకునేది 12కి , 1 కి అని మీరనుకుంటే మీరు చాలా సమయం వృధా చేస్తున్నారని తెలుసుకోండి.

మీరు త్వరగా లేచి ఉపయోగపడే పనులు వ్యాయామం, రీడింగ్, music వినడం, ప్రకృతిని ఆస్వాదించడం (సూర్యోధయం, చెట్లు, స్వచ్చమైన గాలి) లాంటివి చెయ్యకపోయిన మీరు ఉదయాన్నే లేచి వృధా అవుతుంది.  కాబట్టి ఉపయోగపడే పనులు చేయండి.

తెల్లవారుజామున కోడి కూడా లేస్తుంది ఏం బాగుపడింది చికెన్ వండుకొని తినేస్తారు అని మీరు సినిమా dailouge కొట్టొచ్చు.

మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ కోడి చచ్చి చికెన్ షాప్ వాడికి డబ్బులు అలాగే తిన్న వాళ్ళకి సంతోషాన్ని  ఇస్తుంది.

కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే మనకు ప్రతిరోజూ లభించే తాజా 24 గంటలు అనే సంపదని ఎక్కువ శాతం వినియోగించుకుందాం.

అలాగే మీరు ఆ సంపద పట్ల కృతజ్ఞత కలిగివుందండి ఎందుకంటే రేపు అనేది అందరికీ దక్కేది కాదు.

2.సంగీతం యొక్క ప్రాముక్యత

     మనం ప్రతిరోజూ చెవిలో ear-phones పెట్టుకొని ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెవిలో అవి పెట్టుకొని వుంటే చెవుడు వస్తుందిరా అని తిడుతుంటారు ఇలాంటి సన్నివేశాలు ప్రతి ఇంట్లోను కామన్, కొంతమందికి సంగీతం అంటే అంత పిచ్చి(కేవలం సంగీతం వినేవాల్లగురించి మాట్లాడేది).  మరీ ఎక్కువ earphones పెట్టుకొని విన్న ప్రాబ్లమే.

మన జీవితంలో సంగీతానికి చిన్నప్పటి నుంచే ప్రత్యేక స్థానం ఇచ్చేశాం, చిన్నపుడు ఏడుస్తున్నప్పుడు అమ్మ పాడే జోల పాట, పెద్దయ్యాక love songs, జీవితం లో నిరాశ కలిగినప్పుడు motivational songs, సంతోషంగా ఉన్నపుడు మాస్ songs, ఇలా పాటరూపంలోనో సంగీతావాయిద్యాలా రూపం లోనో, కచేరీ రూపం లోనో  మనం సంగీతానికి importance ఇచ్చాము.

     మనం చెప్పుకోలేని భాధలను సంగీతం వినడం వల్ల రిలీఫ్ అవుతాం. కష్టాల్లో అందరూ విడిచిపోయిన సంగీతం మనకు ఊరటను ఇస్తుంది. కాబట్టి సంగీతానికీ ప్రాముక్యతా అవసరం.

 నేను కోరుకున్నపుడు ఆనందాన్ని, శాంతిని, ఇచ్చిందని , మనలో ఆనందం, ఎడతెగని విజయకాంక్ష ఉండాలని దానికి సంగీతం ఎంతగానో దోహదం చేస్తుందని ఈ పుస్తక రచయిత రాబిన్ శర్మా చెబుతారు.

                               ————–@@@—————

     ఈ పుస్తకంలో (The Greatness Guide 2 book in Telugu) మనం చెప్పుకున్న విషయాలు మాదిరి ఇంకా చాల విషయాలు వున్నాయి ప్రతి ఒక్కటి మన జీవితానికి ఉపయోగపడే విషయాలే, వాటిని చదివి మెరుగ్గా జీవిద్ధాo.  

చదవండి (Read also)

Read The above Article in the English Language, click below

  1. The Greatness Guide 2

2. రహస్యం

మరిన్నిటి కొరకు (For More) >>>>> Twinkletalks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!