Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
the magic book review
Share to others

Hello, everyone, welcome to Twinkle Talks.

This Article Was written by Prakash. K — published on www.twinkletalks.com

మ్యాజిక్ | Magic book review in Telugu | రొండా బర్న్

ఈ రోజు మనం రచయిత్రి రొండా బర్నరచించిన ఒక  పుస్తకం గురించి తెలుసుకుందాం

Book Details:

పుస్తకం పేరుమ్యాజిక్
రచయిత్రి రొండా బర్న్ 
Magic book review in telugu

The Secret సిరీస్ లో ఈ పుస్తకం మూడవది.

మనం మన జీవితం లో ఎప్పుడైనా సహాయం అందినప్పుడు సాయం చేసిన వారికి కృతజ్ఞత చెపుతాము. కొంతమంది మనస్ఫూర్తిగా, కొంతమంది formaltiki చెపుతారు.

మన జీవితంలో కృతజ్ఞత అనే విషయం important role ప్లే చేస్తుంది.

Magic  పుస్తకంలో మొత్తం 27 అభ్యాసాలు కృతజ్ఞత భావాన్ని మెరుగు పరచటానికి ఉపయోగపడతాయి.   

“ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత సంపద లభిస్తుంది
ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వారి దగ్గర ఉన్న సంపద కూడా నశించి పోతుంది”
Magic book review in telugu

be thankfull for what you have

వీటిని followఅవుతునప్పుడు gratitidue యొక్క మ్యాజిక్ ను ఆస్వాదిస్తారు. వాటిలో కొన్ని….

Lets discuss : (Magic book review in Telugu)

1.ఒక list ని తయారుచేయండి

     మీ దగ్గర వున్న వస్తువుల పేరులని ఒక పేపర్ లో రాయండి, ఆ వస్తువులు మీరు కలిగి వున్నందుకు వాటి వల్ల మీ పనులు జరుగుతునందుకు కృతజ్ఞత కలిగి ఉండండి .

ఒక చిన్న కథ చెబుతాను చదవండి :

సాకేత్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (Transport Office) లో పని చేసేవాడు, అతను ఆర్ధికంగా దిగువ మధ్యతరగతి వాడు అయినా ఆలోచన విధానంలో సంపన్నుడు, ఇంటికి తను పనిచేసే ఆఫీసుకు చాలా దూరం అయినా రోజు తన ఆఫీసుకు సైకిల్ మీద వచ్చేవాడు, ఎలాగైనా వచ్చే జీతంలో డబ్బు కాస్త దాచుకొని బైక్ తీసుకోవాలని తన ఆలోచన, ప్రస్తుతం తనకున్న సైకిల్ పట్ల వచ్చే జీతం పట్ల కృతజ్ఞత కలిగి జీవించేవాడు.

అదే ఆఫీసులో వరుణ్ అనే వ్యక్తి కూడా సాకేత్ పరిస్థితే కానీ సాకేత్ లాగా ఆలోచించే వ్యక్తిత్వం వరుణ్ది కాదు, తనకి బైక్ లేదని, మిగితావారిలాగా సౌకర్యాలు లేవని ఎప్పుడు బాధపడుతుండే వాడు ప్రస్తుతం తనకున్న సైకిల్ అలాగే మిగితగా వాటిపట్ల కృతజ్ఞత కలిగి ఉండేవాడు కాదు.

కొన్ని నెలలు తరువాత సాకేత్ తను అనుకున్న విధంగా వచ్చే డబ్బును పోగు చేసి బైక్ కొన్నాడు, తన జీతం కూడా పెరిగింది, ఇంకా సంతోషకరంగా జీవించడం మొదలు పెట్టాడు, వరుణ్ కి కూడా జీతం పెరిగింది కానీ వచ్చే డబ్బును ఎలా ఖర్చుపెట్టాడో తనకే అంతుచ్చిక్కక పోవడంతో జీతం పెరిగిన బైక్ కొనలేక అలావుండిపోయాడు.

పైన చెప్పిన కథలో సాకేత్ తనకున్న వస్తువుల పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఇంకా పైకి ఎదగాలనే ఆలోచనతో ఉన్నాడు, కానీ వరుణ్ వున్న వాటిపట్ల కృతజ్ఞత లేకుండా భవిష్యత్తు పై ఎలాంటి ప్రణాళిక లేకుండా జీవిస్తూ ఎప్పుడు నిరాశగా బ్రతుకుతున్నాడు. పెద్దలు అన్నట్లుగా “నీకు మంచి చెప్పులు లేవని బాధపడకు కాలు లేనివారు చాలామంది ఉన్నారు, నీకు రోజు లభించే భోజనం నచ్చడం లేదని బాధపడకు కనీసం ఒక్కపూట అన్నంకోసం వెతికే వారు చాలామంది ఉన్నారు.”

ప్రస్తుతం ఉన్నవాటిపట్ల కృతజ్ఞత కలిగి మనకు కావలసిన వాటికొరకు ఇష్టంతో కష్టపడదాం.

                               2. మీ పొందుతున్న సేవలకి

మనం ప్రతిరోజూ పొందుతున్న సేవలకి మనం ఎల్లపుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి

ex; news paper, Internet, cab, etcetera.,

అదేంటి మనం వాటికి డబ్బులు చెల్లిస్తున్నాం కదా ఫ్రీ గా ఏమి తీసుకోవటం లేదు కదా అని కొందరు అనుకోవచ్చు, నిజమే కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాకాని మనకు సేవలను అందించేవాళ్లు లేకపోతే ప్రయోజనం లేదుకదా, కాబట్టి ఒకరికి ఒకరు కృతజ్ఞత కలిగి ఉండాలి.

                                      3. మీ ఆరోగ్యం పట్ల

అవును మీరు ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు చాలా మంది ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్ లో వుండటం జరిగుంటుంది కాబట్టి మనకు కలిగిన చక్కటి ఆరోగ్యం పట్ల మనం కృతజ్ఞత కలిగి వుండాలి.

     రచయిత్రి పుస్తకములో, మీకు ambulance కనిపించినప్పుడు మీకు వున్న health పట్ల thankfull గా ఉండమని చెపుతుంది.

     ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తలపై కిరీటాన్ని ఒక రోగి కి మాత్రమే కనిపిస్తుంది

                                            4. మ్యాజిక్ శిల

మీరు రాత్రి పూట నిద్ర పోయేముందు ఒక వస్తువును ex; dice, hairpin, pencil.,

మీ అరచేతిలో పెట్టుకొని ఆ రోజు జరిగిన మంచి విషయాలను గుర్తుకు తెచ్చుకోండి, అవి జరిగినందుకు వాటికి కారణమైన వాళ్ళ పట్ల కూడా కృతజ్ఞత తెలపండి.

నా అభిప్రాయం (My opinion) ;

Magic book review in telugu
Magic book review in telugu

Rhonda Byrne మనకు కావలసిన ముఖ్యమైన కృతజ్ఞతా భావం గురించి దానిని improve చేసుకోవటానికి 27 excercise వివరించింది, 27 రోజులకు 27 excercise లు అన్నమాట.

మీరు కూడా ఈ book చదివి కృతజ్ఞతా భావం (gratitude) యొక్క మ్యాజిక్ ను ఆస్వాదించండి.

@@@@@@@@@ thankyou & keepsmiling @@@@@@@@@@

Read The Above Article in English >>> The Magic

Read also

  1. రహస్యం

3. For more click >>>> Twinkle Talks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!