Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this December, 2023 - Enjoy the Articles
Share to others

Andhariki Namaskaram – Twinkle Talks ku swagatham. Maa Thuje Salaam

Published on 15 Jan 2020 ; written by – Naninestham

  తల్లి కొడుకుల మధ్య జరిగే సంభాషణ – Conversation between Mother & Son

{ Phone ringing sound }

Hello బాబు, ఎలా వున్నావురా ?

Son : ah బాగున్నాను అమ్మ, మీరు ఎలా వున్నారు? Bharathi ఎలా వుంది? Tablets, time కి వేసుకుంటున్నావా?

Amma : మేము బాగానే వున్నాము bharathi నా ఆరోగ్యం గురించి అన్నీ చూసుకుంటుంది లేరా..

Son : Last week doctor chekup కి వెళ్ళావా ? ఏమి చెప్పారు doctor?

Amma : ఆ వెళ్ళాను doctor దగ్గరికి, BP కి తోడు గా ఇప్పుడు sugar కూడా వచ్చిందిరా ,.

Son : అలాగా , ఏమి కాదులేమా medicines వాడుతున్నావుగా cure అవుతుందిలే.

Amma : ఈ వయసులో BP , Sugar లు మామూలే రా. మాకు ఎప్పుడు నీ గురించే దిగులు.

Son : నా గురించి , నీ health గురించి కంగారూ పడవద్దు అమ్మ.  సరే కానీ Vikram గారు ఎలా వున్నారు? భోజనం చేసారా ?

Amma : తండ్రి ని పేరు తో పిలుస్తావా రా? గాడిద

Son : నా ఇష్టం మా daddy ఎలా అయిన పిలుస్తాను.

Amma : అబ్బో, సరేలేరా మీ daddy మీ ఇష్టం గాని, ఎప్పుడు వస్తున్నావు?

Son : ఇప్పుడల్లా కుదరదు మా….

Amma : ఎప్పుడు అడిగిన ఇలానే అంటావు , సరే గాని నీకు పెళ్లి సంబంధాలు చూడటం start చేసారా..

Son : ఎందుకు మా ?

Amma : ఎందుకు అంటావ్ ఎంటిరా ? pelli చేసుకోవా ఏమిటి ,ఎప్పుడో అవ్వాల్సింది , ఈ సారి నువ్వు తిరిగి వెళ్ళేధి ఒక కొడుకు గా, అన్న గా మాత్రమే కాదు ఒక భర్త గా కూడా గుర్తుపెట్టుకో.

Son : అబ్బా ! అమ్మా, చెల్లి కి పెళ్లి అయిన తర్వాతే నా పెళ్లి అని మీకు చెప్పాగా అమ్మ….

Amma : అలా ఏమి కుదరదు ఈసారి compulsory గ పెళ్ళి చేసుకోవాలి అంతే.

( అప్పుడే రూంలోకి వచ్చిన భారతి ఫోన్ మాట్లాడుతున్న ఆ తల్లిని చూసి ఒక్కసారి గట్టిగా

Amma ఏవరితో మాట్లాడుతున్నావు ? ఆ పని చెయ్యని phone లో ? అన్నది కూతురు bharathi బిగ్గరగా అరుస్తూ , Tablets అమ్మ చేతిలో పెట్టింది )

ఒక్కసారిగా ఉల్లికిపడింది ఆ తల్లి

కూతురు ఇచ్చిన tablets వేసుకొని, కుర్చీలో కూర్చొని ఎదురుగా గోడకి వున్న తన భర్త, కొడుకు, photo లని గర్వంతో కూడిన మనోవేదనతో అలా చూస్తూ వుండిపోయింది ఆ తల్లి.

తన భర్త వీర మరణం పొందిన ఒక సంవస్తరం( 1 year) లోనే తన కొడుకు Bharath కూడా దేశ సరిహద్దులో వీర మరణం పొందాడు.

భరతమాత ముద్దు బిడ్డల గురించి ఆ బాలగంగాధరుడి సాహిత్యంలోని దేశ భక్తిని చూద్దాం.

ఆమె ఆరోజు కూడా కొడుకుతో పార్కుకి వచ్చింది

అలాగే తెల్ల చీర కట్టుకుంది కానీ ఎర్రని బొట్టు లేదు

నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు లేవు, చేతులకు గాజులు లేవు, ఆమె సోగకన్నులలో వానకురిసి వెలిసిన ఆకాశం స్పరించింది, అక్కడ చేరిన గుంపులు జైహింద్ అన్న నినాదం చేశారు.

“అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడు -ఇంకా రాడేం?”

అని అడుగుతున్నా కుమారుణ్ణి అక్కున చేర్చుకుని

ఆమె కూడా రుద్దఖంఠంతో జైహింద్ అని మెల్లగా పలికింది, ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి హాయిగా తీయగా వినపడింది.

ఏ ప్రాంతంలో పుట్టిన అఖండ భారతావనిని ఇది నా ఇల్లు అని బావిస్తాడు ప్రతి ఒక్క సైనికుడు. ఆ సైనికుడికి ప్రాతంలో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, హోదాతో సంబంధం లేదు తాను పుట్టున నేలపై బ్రతుకుతున్న మనిషిని, పశువుని, చీమను, రెమ్మను కాపాడటం తన భాద్యతగా భావిస్తాడు ఒక సైనికుడు.

నా కోసం, నీకోసం, మన కోసం, మనలో ఒకడు మనకై ఒకడు సరిహద్దులలో కాపలాకాస్తున్నాడు, అసువులు బాస్తున్నాడు. ఇలాంటి ఎందరో భరతమాత బిడ్డలకు ఆ బిడ్డలను కన్న తల్లితండ్రులకు “Twinkle Talks” చేస్తుంది శతకోటి పాదాభివందనం.

మన సైనికులకి, అలాంటి తల్లులకీ, మనం ఎన్ని జన్మలకైనా ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ? కేవలం ప్రతి సంవస్తరం January 15 Indian Army Day రోజు లేదంటే ఏదైనా సంగటన జరిగిన రోజు తలుచుకుంటే సరిపోతుందా?

 మన దేశం కోసం ఎందరో వీరులని కన్న తల్లులకీ మనస్ఫూర్తిగా Twinkle Talks చేస్తుంది పాధాభివంధానాలు.

              *********** Maa Thuje salaam *********

Written by – Nani nestham

featured image: Photo by Nandhu Kumar from Pexels

మరిన్ని చదవండి:

  1. కనిపించని కంచెలు

2. సునామీ

By Twinkle Talks

Prakash. K I am a keen learner, currently pursuing a career in the content and copywriting universe. With an increased passion towards writing, I aim to capitalise on my interest as a blogger and have been sharing my thoughts on different topics through Twinkle Talks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!