Happy New Year 2024 - Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this March, 2024 - Enjoy the Articles
Share to others

Contributed by: Prince Ashwanth Kumar – Good Memory and Concentration in Telugu.

Published on: www.twinkletalks.com


అందరికీ నమస్కారం twinkle talks కి స్వాగతం

ముందుగా పుస్తకం గురించి తెలుసుకునే ముందు ఒక్కప్రశ్న మీరు మీ స్నేహితులతో కలసి తిరుపతి వెళ్ళాలని అనుకున్నారు. కార్ మీరే నడుపుతూ ఒక్కొక్కరినిఎక్కిoచుకుంటూ వెళ్తున్నారు. విజయవాడ లో మీతో పాటు రమణ, శేషు అనే ఇద్దరు స్నేహితులుఎక్కరు,నెల్లూరు దగ్గర రమణ కి ఏదో పని ఉండిదిగిపోయాడు, అక్కడ శేఖర్, మల్లిక్, ప్రసాద లుఎక్కారు. రేణిగుంట దగ్గర ప్రసాద్ దిగిపోయాడు, కారునడపడం వచ్చిన అనిల్, రవి ఎక్కారు. తిరుపతి చెరగనే ప్రసాద్ దిగిపోయాడు. మీరంతా కొండమీదకువెళ్లారు.

ఓకే !ఇప్పుడు నా ప్రశ్న కారు డ్రైవర్ పేరు చెప్పగలరా? మళ్ళీ పై పేరా చదవకండి. మీరు కరెక్ట్ గా చెపితే మీ జ్ఞాపకశక్తి బాగుంది. చెప్పలేని వాళ్ళు మళ్ళీ చదవండికారు ఎవరు నడిపింది తెలుస్తుంది.

                                                                        *****         

ఈరోజు మనం Dr. B V పట్టాభిరామ్ రచించిన పుస్తకం గురించి తెలుసుకుందాం.

Book Image:

Memory power and concentration
Book Image

పుస్తకం వివరాలు:

పుస్తకం పేరు జ్ఞాపకశక్తి ఏకాగ్రత
రచనDr. B V పట్టాభిరామ్
పబ్లికేషన్స్ – PublicationsEmesco Books

ఈ పుస్తకం మనకి జ్ఞాపకశక్తి ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. జీవితం లో ప్రతీ ఒక్కరికి మతిమరుపు ఉంటుంది. ఏదో ఒక సందర్బం లో అది బయటపడుతుంది.అలాంటి మతిమరుపు ను ఎలా అదిగామించాలి దాని కోసం మీకు ఈ పుస్తకం ఉపయోగ పడుతుంది. ఓకే లెట్స్ start ఇప్పుడు ఈ పుస్తకం లో వున్నా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేదాం.

Good Memory and Concentration in Telugu

1 జ్ఞాపకశక్తి కి కీలకం ఏకాగ్రత :

            మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే short cut లో గుర్తుపెట్టుకోవడం మంచిది example రాయలసీమ లో జిల్లాలు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే “అకచిక” అనే పదం గుర్తు ఉంటే చాలు.అనంతపురం, కర్నూల్, చిత్తూరు, కడప గుర్తుకొస్తాయి. దీనివల్ల ఆవిషయం మనకి ఎక్కువ రోజులు గుర్తుoటుంది.

నిజానికి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కవలపిల్లలు. ఏకాగ్రతఉంటేనే  జ్ఞాపకశక్తి ఉంటుంది.జ్ఞాపకశక్తి కావాలoటేఏకాగ్రత ఉండితీరాలి. ఏకాగ్రత అంటే ఆసక్తి, సినిమాథియేటర్ లో కూర్చొని రెండు గంటలు ఆసక్తిగా సినిమా చూసే శక్తి మిలో ఉంటే,  అంతే సమయం మీరు చదువుకి కూడా ఇవ్వగలరు.

మీరు మీ చదువు పట్ల ఏకాగ్రత కోల్పోతారు అనుకుంటే మీరు మీ goal setting గురించి ఆలోచిస్తే చాలు.మనం ఏది అయినా ఒక విషయాన్ని ఏకాగ్రత తో   mind లో save చేసుకుంటే అది ఎప్పటికి మర్చిపోము నిజంగా చెప్పాలి అంటే మనకు అవసరం లేనప్పుడు కూడా అవి మనకు గుర్తుకు వస్తాయి.  Example గా కింది అనుభవాలను గుర్తుచేసుకోటనికి ప్రయత్నించండి

1 మీరు చదివిన మొదటి స్కూల్ పేరు?

2 మీరు స్నేహితులతో  వెళ్లిన ఒక విహారయాత్ర, ఎలా వెళ్లారు?

3 మీ తల్లిదండ్రులతో  వెళ్లిన ఒక తీర్థయాత్ర

4 మీకు జీవితంలో బాగా బాధాకరం అయినా ఒక సంఘటన

5 మీ అమ్మమ్మ తాతయ్య, పేర్లు వారి ముఖాలు

వెరీగుడ్…. మీకు పైన చెప్పిన అనుభవాలు అన్ని గుర్తుకు వస్తే మీరు ఈ book చదవనవసరం లేదు. మీకు అద్భుతం అయినా జ్ఞాపకశక్తి వుంది 4 వస్తే మీ జ్ఞాపకశక్తి బాగుంది. 2 వస్తే మీరు పరవాలేదు.

 2 జ్ఞాపకశక్తికి బాగా కష్టపడాలా ?

            నిజానికి అంత కష్టాపడాల్సిన అవసరం లేదు.example మీరు exams కి ప్రేపరషన్ స్టార్ట్చేసారు అనుకుందాం మీకు మాథ్స్ అంటే భయం అనుకుందాం అందులో వుండే ఫార్ములాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని బాధపడకుండా అందులో వుండే ఫార్ములాలు అన్ని ఒక పేపర్ లో రాసుకొని వాటిని మీరు చదివే రూమ్ లో గోడకు అతికించూకొని వాటిని రోజు ఉదయం లేవగానే చదువుకోండి ఇలా మీరు కొద్ది రోజులు  చేయండి. తరువాత కొద్ది రోజులకి మీకు తెలియకుండానే ఆ ఫార్ములాలు మీకు గుర్తుండి పోతాయి.

చాలా మంది ఇంగ్లీష్ లో కొన్ని పదాలకు స్పెల్లింగ్లు గుర్తుపెట్టుకోవడం కష్టం example “mathematics”దీనిని గుర్తుపెట్టుకోడానికి రెండు MAT  MAT లు దూరంగా వున్నాయి వాటి మధ్యలో HE అనేవాడు కూర్చునాడట.అప్పటికి అది MATHEMAT అవుతుంది. HE అనే వాడు ఏమి చదువు కున్నాడు అంటే  ICS.చివరిగా MATHEMATICS అవుతుంది. ఇలాంటి గుర్తులు పెట్టుకొని చదవడం వల్ల మనం చదువుకున్నవి బాగా గుర్తుపెట్టుకోగలము.

 నా అభిప్రాయం : ( My Opinion )

నాకు జ్ఞాపకశక్తి సరిగా లేదు అని ఎవరు అయినా అనుకుంటూ ఉంటే ఈ బుక్ చదవండి మీకు మీ పైన మంచి కాంఫిడెన్స్ వస్తుంది. జ్ఞాపకశక్తి కి సంబందించిన ఎనో గొప్ప  విషయాలు ఈ book లో మనకోసం Dr.B.V.పట్టాభిరామ్ గారు వివరించారు. మీరు కూడా ఈ బుక్ చదివి మంచి జ్ఞాపకశక్తి –ఏకాగ్రత ను సంపాదిస్తారు అని కోరుకుంటున్న.

                                                @@@@@@ Thank You @@@@@@

Read Also

  1. రహస్యం

2. అమృతం కురిసిన రాత్రి.

3. For more click here >>> www.twinkletalks.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!