Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

Funny Situations in Telugu

This Article was written by Nani Nestham – Published on TwinkleTalks

1.ఆంటీల ముందు tv సీరియల్స్ ని వెక్కిరిస్తే 

     మమ్మల్ని ఎమన్నా అను వదిలేస్తాం అంతే కానీ సీరియల్స్ జోలికి వస్తే దబిడి దిబిడే. ఇంకా వంటలక్క సీరియల్ వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేస్తే ఇక మూడో ప్రపంచపు యుద్ధమే, భర్త లేదు, కొడుకు లేదు, దబిడి దిబిడే.

     కాబట్టి ఇలాంటి సాహసాలు చెయ్యకూడదు చేస్తే  బదులుగా చెల్లించక తప్పదు భారీ మూల్యం కాబట్టి మిత్రో తస్మాత్ జాగ్రత్త.

2. చదువుతున్నప్పుడు సెల్ కి మెసేజ్ వస్తే 

     మనం చదివేదే అమావాస్య పుణ్యానికి ఒకసారి అప్పుడు కూడా ఎంతగానో కష్టపడి 10 నిముషాలు చదివేది. అసలే ఆ ఇంస్టాగ్రామ్ మరీను రంగు రంగుల మాయజాలంతో మురిపిస్తాది, ఆ వాట్సప్ అయితే పనికొచ్చేవి అలాగే పనికిరాని ఫార్వర్డ్ మెసేజ్ లతో నిండిపోయి ఉంటాది, మరీ ట్విట్టర్ లోనేమో నిబ్బా ఫ్యాన్ వార్స్ లో మన రోల్ ఎలాగో ఉండాలి అది వేరే విషయం

     పోనీ సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేద్దామా అంటె మనస్సు ఒప్పుకోదు, ష్ దేవుడా ఈసారి కూడా supply కాయం.

3.Birthday పాపా మనకి ఎక్సట్రా చాక్లెట్ (extra chocolate) ఇచ్చినప్పుడు. 

     అందరికి రెండు చాక్లెట్ ఇచ్చి నాకు మాత్రం 3 చాక్లెట్ ఇచ్చిందంటే నేనంటే ఎంత స్పెషల్ రా…!

ఎలాగైనా సరే తననే పెళ్లి చేసుకోవాలి 

ప్రపంచమే మాకు అడ్డుగా నిలిచినా సరే పంచభూతాల సాక్షిగా మేము ఒకటి అవుతాం.

4. మాథ్స్ టీచర్ (maths teacher ) ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పినప్పుడు.

     ” దైవం మనుష్య రూపేణా “

దండాలయ్యా… దండాలయ్యా….

5. తెలియని భాష సినిమా చూసినప్పుడు. 

     అందుకే అన్నారు సినిమా శరీరం అయితే subtitles ఊపిరి అని.

     సరేలే మనకు నచ్చినది ఊహించుకుందాం.

6. పాలకూర బదులు తోటకూర తెస్తే.

     ఎదో ఒక కూర అని అనుకోరు ఇంట్లో పోనీ ఎంత బాగా చుసిన ఒకేలా ఉంటాయి నా కళ్ళకి.

     ఆఖరికి ఆకుకూరలు కూడా తిట్లు తినిపిస్తున్నాయి. 

7. External ల్యాబ్ లో easy experiment వస్తే.

     అంత సేపు పడ్డ టెన్షన్ ఒక్కసారి మటాష్ 

చెప్పరు గాని మన దోస్తులకు మండుతుంటది. 

8. వున్న backlogs అన్ని ఫైనల్ ఇయర్ లో క్లియర్ చేస్తే.

     ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య అయినా అప్పడు చిన్నగా కనిపిస్తుంది.

     ఒక బాహుబలి,  ఒక మగధీర…..

9. తమరి నిరుద్యోగ జూనియర్ అతని కష్టాలు పంచుకుంటే 


హలో తమ్ముడు ఇవన్నీ చూసి చూసి దిమ్మ తిరిగింది.నువ్వు చెప్పడం ఆపు అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ నుంచి,130 ఉద్యోగాలకు గాను  భారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అని వొచ్చే ప్రకటనల వరకు అన్ని చూసేసాం.

10. Lockdow తర్వాత అబ్బాయిల జుట్టు సంగతి 

ఉహించుకొనేది 


చూడలేని నిజం 

11. చికెన్ ధరలు చుక్కలు తాకినప్పుడు 


ఊహల్లో వుండే రుచే వేరు 

12. ఆదివారం స్నానం చెయ్యమంటే.

     అమ్మా ఎం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా నా మనోభావాలు దెబ్బ తిన్నాయి.

     ఇంకెప్పుడు ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోమని చెప్పొద్దూ. 

     స్నానం అంట స్నానం అదికూడా ఆదివారం నాడు హవ్వ…!

13. మీరు చేసిన తప్పుకి టీచర్ మీ ఫ్రెండ్ కి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు

ప్రస్తుతానికి సరే మామ లంచ్ బెల్ కొట్టనివ్వు ఓరి దేవుడా నీకు ఉంటాది. మీకో విషయం తెలుసా క్లాసులో సైలెంటుగా ఉండే ఆణిముత్యాల్లే ఎక్కువ అల్లరి చేస్తారు కానీ వాళ్ళ అల్లరి చాప క్రింద నీరులాగ అందరికి కనపడదు, ఆ తడి కారణంగా క్రింద తడిచిన వాళ్లకి మాత్రమే కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో 90% అల్లరి వాళ్ళే చేసారు అని తెలిసినా కూడా నీవల్లే ఇలా తయారయ్యారు అని పక్కవాడికి పడతాయి తాళింపు. 

14. మన ఎగ్జామ్ ఆన్సర్ పేపర్ను అందరి ముందు చదివి మరీ కరెక్షన్ చేస్తే

టీచర్ టీచర్ ఒద్దు టీచర్ ప్లీజ్ టీచర్ మీకు దండం పెడతాను టీచర్,

           ఉంటారు ఇలాంటి గొప్ప గురువులు ప్రతి స్కూల్ మరియు కాలేజీలో, ఇక్కడ ఎటకారం ఏంటంటే మనదాంట్లో చూసి కాపీ కొట్టిన మన జిగిరి గాడు కూడా నవ్వడం, ఒకపక్క సొంత కవిత్వం, మరోపక్క క్వశ్చన్ పేపర్లోని పదాలని అటు తిప్పి ఇటు తిప్పి రాయడం, అది మన గురువుగారు అందరి ముందు గట్టిగా చదివి జోకులేస్తూ, మనల్ని ఇబ్బంది పెట్టి అమ్మాయిలు ఎక్కువగా నవ్వితే ఇంకా ఎక్కువగా నవ్వించటానికి మనల్ని బలి చేసే సందర్భం అది ఏమి చేస్తాం చెప్పండి చదువుకుని కొంతైనా కరెక్ట్ పాయింట్స్ రాస్తే బాగున్ను అని అప్పుడు అనిపిస్తుంది.

Funny Situations in Telugu

వీటిలో మీరు నిజ జీవితం లో ఎదుర్కొన్నా లేదా మీకు వీటిలో ఏది నచ్చిందో కామెంట్ చెయ్యండి, థాంక్స్. 

Read this article in English here >> Some funny situations

——————–@——————————–

మరిన్ని చదవండి :

  1. అమ్మబాబోయి

2.Types of comments in You-tube Channel

For more click here >>> Twinkle Talks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!