Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Nesthama
Share to others

Welcome to Twinkle Talks

Written by K. Prakash – Published on Twinkle Talks

నేస్తమా  నిన్నే ఓ నేస్తమా నిన్నే 

నీతో మాట్లాడాలని ఉంది

 నా గురించి నీకు చెప్పుకోవాలని వుంది వింటావా? 

 నీతో ఎంతసేపు ఉంటానో తెలియదు 

కానీ ఉన్నంతసేపు నీకు చాలా చెప్పాలని వుంది..

తల్లి రొమ్ము ఎరుగను 

నాన్న ముద్దు ఎరుగను 

తల్లి రొమ్ము ఎరుగను 

నాన్న ముద్దు ఎరుగను కానీ 

తల్లి పడే తంటాలుకు 

నాన్న పడే ఇబ్బందులకు కారణం నేనే! 

నాకు కులం అనేది  లేదు మతం అనేది  లేదు 

నాకు కులం లేదు మతం లేదు అసలు 

చెప్పాలంటే ప్రాణమే లేదు 

కానీ…

ప్రాణాలు తీయగలను ప్రాణాలు పోయగలను 

ప్రాణమే లేని నేను ఏమైనా చెయ్యగలను !

ఒక తల్లి తలపై బరువును 

ఒక తండ్రి చొక్కాకు పట్టిన చెమటను ! 

నేస్తమా వింటున్నావా?  

నీ ప్రేమ నీకు దక్కకపోవటానికి ఒక కారణం నేను

పిల్ల తండ్రికి పట్టిన బెంగను నేను 

పిల్లగాడి తండ్రికి పట్టిన గర్వాన్ని నేను 

తోలుకప్పిన ఎముకలకు సొగసును నేను 

తిన్నదరగని బొజ్జలకు బీజం నేను 

నేస్తమా  వింటున్నావా ?

చాలా దూరం నుంచి వచ్చాను 

ఎందరినో తాకుతూ వచ్చాను 

ఎందరినో తాకుతూ వచ్చాను 

ఎంతమందిని తాకిన మలినమంటలేదురా !! 

మలినమంటినగాని నన్ను చీదరించుకోరురా 

నీ మనసుకంటిన దానితో  పోలిస్తే 

నాది లెక్కలోకి రాదురా.. 

నేస్తమా ! 

అదిగో పొదలచాటున చప్పుడు 

అక్కడ కారిన కన్నీరుకు కారణం నేను 

నలిగిన మల్లెలకు

పగిలిన గాజులకు ఆజ్యం నేను 

మరి నా నివాసం అంటావా 

ఇనుపగదుల్లో ఇమడగలను 

చీర కొంగులో కునుకెయ్యగలను..!

అదిగో అక్కడ 

పాల బుగ్గల బురిడీలు 

వారు తినే చేకోడీలు 

ఆ విన్యాసాలకు  నేను…

ఏంటి నమ్మవా? 

నువ్వు తాగే సిగరెట్ వల్ల 

పాడైపోతున్న నీ పక్క వాడి 

ఆరోగ్యం మీద కూడా ఒట్టు 

విలువ పెరిగే కొద్దీ 

నా చుట్టుకొలత పెరుగుతుంది 

ఎంత ఎదిగినా అణిగిమణిగి ఉండగలను 

అణిగిమణిగి గర్వమును పెంచగలను..

నా పెరంటావా? కొందరు రూపాయి అంటారు, మరి కొందరు డాలర్ అంటారు

ఒక్కో దేశంలో ఒక్కోలా పిలుస్తారు.

సరే నేస్తమా వెళ్ళొస్తా!! 

నా కోసం శ్రమించే వారి చెమటను తాకాలి 

ఆ చెమటను పిండే అసురునికి తోడునివ్వాలి

సెలవు….  

Please Share this Poem to others


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!