Welcome to Twinkle Talks - Happy to see you here - Enjoy the Articles

కరోనా వైరస్ – (In Telugu)

Share to others

Article About: Corona Virus details in Telugu – Published on Twinkle Talks ; please stay at home

హమ్మయ్యా ఆ మహమ్మారి నుంచి బయటపడ్డాము ఇంకా మనం సేఫ్ వ్యాక్సిన్ కూడా వచ్చేసింది ఇంకా మనకు భయము లేదు తిరుగులేదు, అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు కరోనాలో కాలేసినట్టే, అవును నేను చెప్పేది నిజమే అలా అని చచ్చేలా భయపడకండి, ఇంతకు మునపటిలాగే  జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Corona Virus details in Telugu

కరోనా వైరస్ వ్యాప్తి :

  • ప్రస్తుతం ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి కి సోకుతుంది.
  • కరోనా వైరస్ వున్న వ్యక్తి తుమ్మినప్పుడు , దగ్గినప్పుడు, ఈ వైరస్ వేరొకరికి సోకుతుంది .

పాటించవలసిన కొన్ని నియమాలు :

  1. తరచూ చేతులు సబ్బుతో శుభ్రంగా కడుకోవటం.

2. మీ ముఖాన్ని మాస్క్ తో కవర్ చేయడం. ఒకసారి ఉపయోగించిన మాస్క్ ను మళ్ళీ ఉపయోగించటం మంచిదికాధు.

3. ప్రాముఖ్యంగా మీరు జనసంచారానికి దూరంగా వుంటేనే మంచిది. అత్యవసరమైతే తప్ప బయటకి రాకండి.

4. చేతులు శుభ్రంగా కడుకోకుండా మీ / ఇతరుల ముక్కును గాని , కంటిని గాని, తాకవధ్ధు. ఎందుకంటే మీరు బయట చాలా వస్తువులను , వ్యక్తులను తాకి వుంటారు.

5. మీరు మీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి, శుభకార్యాలు అయిన సరే , ఎందుకంటే మీరు చాలా ప్రదేశాలకు గుండా వెళ్లవలసి వస్తుంది, ఆ చోట వైరస్ వుంటే మీకు సోకే ప్రమాదం వుంది.

శుభకార్యాలకు, దూరప్రయాణలకు వెళ్ళినప్పుడు నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్తగా వ్యవహారిస్తే మనకు మంచిది. 

6. మీకు దగ్గు , జలుబు , తల నొప్పి , ఒళ్ళు నొప్పులు శ్వాస పీల్చుకోవటం లో ఇబ్బంది లాంటి లక్షణాలు వుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

6. మీ చుట్టుపక్కల కానీ బంధువుల్లో కాని ఇతర దేశాలనుంచి వచ్చిన చరిత్ర వుంటే పోలీసులకు తెలియచేయండి.

7. ఇతరులను కలిసినపుడు షేక్ హాండ్ (shake hand) ఇవ్వటం మానండి, పలకరించేటప్పుడు నమస్కారం చేయండి చాలు.

#noshakehand

8. మీకు కానీ కరోనా వైరస్ వుందని నిర్ధారణ అయితే దయచేసి isolation నుంచి పారిపోకండి, మీకు తగ్గెంత వరకు డాక్టర్ పర్యవేక్షణలోనే వుండండి, మీరు బయట తిరగడం వల్ల ఇతరులకి సోకే ప్రమాదం వుంది .

don’t go away from isolation

క్వారెంటీన్ లో ఉన్న ఎంతోమంది వైరస్ నుంచి కోలుకొని సంతోషంగా భయటకు రావడం మనం చూసాము, అలాగే భయంతో వైద్యులకు సహకరించకుండా చాలా మందికి అంటించిన వారిని చూసాము, కాబట్టి ఈ సారి వచ్చిన, ధైర్యంగా ఉండి వైద్యులకు సహకరించి మళ్ళీ విజేతగా నిలవండి. 

9. నియమాలు పాటించి స్వీయ రక్షణతో corona virus chain ను బ్రేక్ చేధ్ధాము.

12. ధయచేసి కరోనా వైరస్ తాలూకు మరణాల గురించి కానీ medicines గురించి కానీ సోషల్ మీడియా లో వచ్చే ప్రతి వాటిని నమ్మోద్దు, government official website లో మాత్రమే చూడండి. Medicines doctors సూచనల మేరకు వాడండి.

మరింత సమాచారం కొరకు క్రింద వున్న లింక్ ను క్లిక్ చేయండి https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public

World health Organisation వారి website లో చూడండి.

మనకు రాదులే అని నిర్లక్ష్యంగా దయచేసి ఉండొధ్ధు

నిర్లక్ష్యం పెను ప్రమాదకరం.

భారత దేశము లో తయారు చేసిన కోవిడ్ 19 వాక్సిన్ గురించి కొన్ని వివరాలు :


1). భారత దేశము లో తయారు చేసిన వాక్సిన్ లు ఎన్ని? అవి ఏవి?

జ). భారత దేశము లో మొత్తం రెండు కరోనా వాక్సిన్లను తయారు చేసారు.

కోవాక్సిన్, కోవిషీల్డ్

సూచికకోవాక్సిన్కోవిషీల్డ్
వాక్సిన్ రకముమొత్తం వైరియన్ను నిష్క్రీయాత్మకం చేసే కోవిడ్ 19 వాక్సిన్వైరల్ టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిన కోవిడ్ వాక్సిన్
ఒక వాక్సిన్ సీసాలో ఉండే డోసులు2010
షెల్ఫ్ జీవిత కాలము6 నెలలు6 నెలలు
వాక్సిన్ టీకా మీద ఎక్సపైరి తేదీ ఉంటుందాఉంటుందిఉంటుంది
వాక్సిన్ సీసా మానిటర్అందుబాటులో లేదుఅందుబాటులో లేదు
వాక్సిన్ యొక్క భౌతిక రూపముఅపారదర్శకమైన తెలుపురంగులేని నుండి కొద్దిగా గోధుమ రంగు వరకు ఉంటుంది
వాక్సిన్ ను వేసే శరీర భాగముభుజ కండరానికిభుజ కండరానికి
డోసుఒక్క డోసు 0.5mlఒక్క డోసు 0.5ml
నియమ కాల పరిమితి4 వారాల పాటు4 వారాల పాటు
కోర్స్2 డోసులు2 డోసులు
18 సంవత్సరాలు నిండని వారికిసిఫార్సు చేయబడలేదుసిఫార్సు చేయబడలేదు
గర్భవతులకుసిఫార్సు చేయబడలేదుసిఫార్సు చేయబడలేదు
పాలిచ్చే తల్లులకుసిఫార్సు చేయబడలేదుసిఫార్సు చేయబడలేదు

అమెరికా దేశంలో ఆమోదం పొందిన వాక్సిన్ల వివరాలు : 

వాక్సిన్వాక్సిన్ రకము స్టేటస్ సూచన
BNT162b2- pfizer and BionTechఎంఆర్ఎన్ఎ (mRNA)ఆమోదించబడింది21 రోజుల వ్యవధిలో 2 డోసుల సిరీస్, 16 ఆపై వయస్సు గలవారికి మాత్రమే అర్హులు
mRNA-1273-Modernaఎంఆర్ఎన్ఏ (mRNA)ఆమోదించబడింది28 రోజుల వ్యవధిలో 2 డోసుల సిరీస్, 18 ఆపై వయస్సు గలవారు మాత్రమే అర్హులు

ఒక చిన్న సలహా

పనిలో పనిగా ఒక చిన్న సలహా, ఈ కరోనా వచ్చాక “ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియదు” అన్న సంగతి మనందరికీ తెలిసి వచ్చింది కాబట్టి మీరు ఏదైనా సాధించాలనుకుంటే, ఏ పనైనా మొదలు పెట్టాలి అనుకుంటే వెంటనే ప్రారంభించండి. ఈ ఆర్టికల్ అందరికి షేర్ చెయ్యండి, నమస్కారం.

” సర్వే జనా సుఖినో భవంతు” 

Read this article in English

  1. Corona Virus

https://twinkletalks.com/corona-virus-covid-19/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Corona Virus (COVID-19)

21st March 2020

error: Content is protected !!