Welcome to Twinkle Talks - Thank you for visiting my website, Happy to see you here, in this April, 2024 - Enjoy the Articles
Share to others

కొన్ని కొన్ని సందర్బాలలో మనకు మైండ్ బ్లాక్ అయ్యి అమ్మబాబోయి అనుకునే కొన్ని సందర్భాలు గురించి మాట్లాడుకుందాం. oh my god situations in Telugu.

Written by Nani Nestham — Published on Twinkletalks.com

1.పరీక్షల results వచ్చిన రోజు మీ నాన్నగారు కొత్త belt కొన్నపుడు

Start muzik

మీ నాన్నగారు తనకి తెలిసిన కరాటే, kungfu ప్రదర్శించడానికి ఒక చక్కటి అవకాశం.

మీరు ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొలేదని అనుకుంటున్నాను ఒకవేళ ఎదుర్కునింటే చో చాల్లి.

2.డాడ్ little princess చేసిన కళాకండం తిన్నప్పుడు.

ఇలాంటి సందర్భాలలోనే మీకు మీ అమ్మ విలువ గురించి తెలుస్తుంది, కాబట్టి ఇలాంటి ప్రయోగాలు రుచి చూసే ముందు ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

కొంపతీసి తీసుకున్నార? ఏం పర్వాలేదు హాస్పిటల్ లో కలుద్దాం.

3.మీ చరవానిని ఎవరైనా తీసుకోవాలనుకుంటే

అదేనండీ మీ cellphone గురించి అనేది

don’t టచ్

ఒకరకమైన చిన్నపాటి హార్ట్ అటాక్ వస్తుంది. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు వున్నారే చాక్లెట్ కన్నా చరవానినే ఇష్టపడతారు games ఆడి ఆడి ఛార్జింగ్ మొత్తం కాలిచేసి కనీసం చెప్పకుండా పెట్టేసి పోతారు.

ఇలాంటివి ఎక్కువ ఫ్యామిలి functions లో, పెళ్లిలలో చూస్తుంటాం ఇవ్వకుంటే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ ఒకవైపు.

4.మన దోస్త్ గాడు అమ్మాయిలతో ఇంగ్లిష్ లో మాట్లాడినప్పుడు

అమ్మబాబోయి…!

spoken english క్లాస్ లో కూడా ఇంత ఇంగ్లిష్ మాట్లాడాడు కానీ అమ్మాయిల ముందు మాత్రం shakesphere గా మారి ఇంగ్లిష్ ని షేక్ చేస్తాడు.

వాడికి అంత english ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అడిగితేనేమో netflix, hotstar కి థాంక్స్ చెప్పాడు.

5. జేబులో సెల్ ఫోన్ గాని earphones గాని లేనప్పుడు .

అమ్మబాబోయి….!

చిన్నప్పుడు మనకి ఇంద్రియ అవయవాలు (sense organs) ఎన్ని అంటే 5 అని చెప్పేవాలం కానీ ఇప్పుడు 6వది ఆ లిస్ట్ లోకి వచ్చి చేరింది అదే cellphone.

బయటకి వెళ్లినప్పుడు కానీ మర్చిపోతే ఒక్కసారి ప్రాణాలు పోయినట్టు ఫీల్ అవుతారు. మనల్ని ఏ గోల నుంచైనా ఉపశమనం అందించే ఒక వజ్రాయుధం

6.మీరు ఇష్టపడే అమ్మాయి మీ ఫ్రెండ్ లవ్లో వున్నారని తెలిసినప్పుడు

అమ్మబాబోయి

7.మన దోస్త్ గాళ్లని లైబ్రరి లో చూసినప్పుడు

ఉన్నటుండి మూడో ప్రపంచ యుద్దం జరిగిన ఆశ్చర్య పోనేమో గాని మా దోస్తులు లైబ్రరిలో కనిపిస్తే మాత్రం షాక్ అవ్వడం గారెంటి.

వాళ్ళని చూడటమే ఆశ్చర్యం అంటే అదికూడా fluid mechanics బుక్ చదువుతూ లైబ్రేరియన్ గారు ఏదో జరగబోతుంది సార్.

8.ఎదురింటి అమ్మాయి అన్నయ్యా అని పిలిచినపుడు

వర్ణించలేని బాద — జై మెకానికల్ , సరేలే ఎంత 7 ఇయర్స్ పెద్దవాడిని అయినంత మాత్రాన్న అన్న అనేస్తావా మనసాక్షి అనేది లేదా నీకు.

9.ఎండాకాలంలో పార్క్ చేసిన బైక్ పై కూర్చున్నపుడు

@@@***###$

వేసవిలో చేసే పొరపాటులో ఇది ఒకటి కొద్ది నిముషాలు లోకం స్తంబించిపోతుంది .

ఇలాంటప్పుడే superman, spiderman లిఫ్ట్ ఇస్తే బాగున్ను అనుకుంటాం.

10. మన సెల్ నెంబర్ కి కాకుండా వేరే నెంబర్ కి రీఛార్జ్ చేసినప్పుడు.

దేవుడా! ఇలాంటివి లాస్ట్ డిజిట్స్ నంబర్స్ తప్పుగా టైప్ చెయ్యడం వల్ల జరుగుతాయి, ఆ నెంబర్ వాడే వ్యక్తి మంచోడు అయితే సరే లేదంటేనా పైసల్ గోవిందా! ఈసారి చూసుకోవాలమ్మా ఎందుకంటే “డబ్బులు ఎవరికీ వూరికే రావు”

11. మనం చదివిన టాపిక్ లో ఒక్క ప్రశ్న పరీక్షలో రానప్పుడు.

కొన్ని కొన్ని సందర్భాల్లో దరిద్ర దేవత మనతో స్నేహం చెయ్యాలని భలంగా కోరుకుంటాది ఏమి చేద్దాం మనం అంటే అంత అభిమానం ఆమెకు.

12. సరిగ్గా ప్రిపేర్ అవ్వని ఎగ్జామ్స్ పాస్ అయ్యినప్పుడు

దరిద్ర దేవతనే కాదు, అప్పుడప్పుడు అదృష్ట దేవత కూడా చుట్టపు చూపికి వచ్చి వెళ్తుంటాది మన జీవితంలోకి అలాంటప్పుడు జరిగే ఒక హటాత్ పరిణామాల్లో ఇదీ ఒకటి.

13. పరీక్ష  బాగా రాసి ఎగ్జామ్స్ షీట్ లో హాల్ టిక్కెట్ నెంబర్ వెయ్యడం మర్చిపోయిన (లేదా) తప్పుగా వేశామని గుర్తు వచ్చిన.

వర్ణించలేని ఒక బాధతో కూడిన ఒక హాయి  తియ్యటి వేపాకు జ్యూస్ తాగినట్టు ఉంటుంది అప్పుడు, పరీక్ష బాగా రాశామని సంతోషించాల్లో, హాల్ టికెట్ నెంబర్ తప్పుగా రాశామని బాధపడాల్లో తెలియని ఒక స్థితి. వేడి వేడి ఐస్ క్రీం ని తీసుకొని వెచ్చని వెన్నల్లో కూర్చొని తిన్నట్టు ఉంటాది అప్పుడు. యుద్ధం ఎంత బాగా చేశామన్నదీ కాదు చివరికి గెలిచామా ఓడామా అన్నదే లెక్కలోకి వస్తాది సో ఎవరు రన్ అవుట్ అవ్వకండి.

————————————————-@@———————————————————

(oh my god situations in Telugu)

ఇంతకన్నా అమ్మబాబోయ్ లాంటివి చూసాం అని గాని లేదా మీకు తెలిసినా ఇలాంటి సందర్భాలు ఉంటే మాతో పంచుకోవటానికి మొహమాటం కానీ సిగ్గు గాని వద్దు మిత్రులారా, ఇలాంటి అమ్మబాబోయి సన్నివేశాలు ఇంకా మీరు ఫేస్ చేసుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.

Read this article in English >>> Oh my god! situations.

మరిన్ని చదవండి :

  1. ఫన్నీ సంధర్బాలు

2.ప్రియమైన నీకు -1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!